Best Diesel Cars: తక్కువ బడ్జెట్లో మంచి డీజిల్ కారు కొనాలా? ఈ మోడల్స్​పై ఓ లుక్కేయండి..!

Best Diesel Cars: ప్రస్తుతం భారతదేశంలో ఎస్‌యూవీలకు డిమాండ్ చాలా వేగంగా పెరుగుతోంది.

Update: 2025-03-26 16:16 GMT
Best Diesel Cars

Best Diesel Cars: తక్కువ బడ్జెట్లో మంచి డీజిల్ కారు కొనాలా? ఈ మోడల్స్​పై ఓ లుక్కేయండి..!

  • whatsapp icon

Best Diesel Cars: ప్రస్తుతం భారతదేశంలో ఎస్‌యూవీలకు డిమాండ్ చాలా వేగంగా పెరుగుతోంది. ఇందులో సీఎన్‌జీ,ఈవీలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం డీజిల్ కార్లపై ప్రజల్లో క్రేజ్ తగ్గడం లేదు. కంపెనీలు డీజిల్ కార్లను తయారు చేయడానికి ఇదే కారణం. మీరు తక్కువ బడ్జెట్‌లో మంచి ఎస్‌యూవీ కొనుగోలు చేయాలని చూస్తుంటే మీకు చాలా మంచి ఆప్షన్లు ఉన్నాయి.

Mahindra XUV 3XO

మహీంద్రా శక్తివంతమైన ఎస్‌యూవీలకు ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం కంపెనీ ఎక్స్‌యూవీ 3XO ఎస్‌యూవీ డీజిల్ మోడల్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇది మాత్రమే కాదు, ఈ ఎస్‌యూవీ బాడీ కూడా చాలా బలంగా ఉంది. ఇందులో 1.5 L టర్బో (CRDe) డీజిల్ ఇంజన్‌ను ఉంది. ఇది 85.8 కిలోవాట్ పవర్, 300 ఎన్ఎమ్ టార్క్‌ రిలీజ్ చేస్తుంది. దీని మాన్యువల్ గేర్‌బాక్స్ 20.6 km/l మైలేజీని ఇస్తుంది. 6 ఆటోషిప్ట్+ 21.2 km/l మైలేజీని ఇస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ MX2 వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారులో మీకు చాలా మంచి స్థలం లభిస్తుంది, 5 మంది కూర్చోవచ్చు. భద్రత కోసం ఈబీడీతో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది.

Tata Nexon Diesel

టాటా మోటార్స్ నెక్సాన్ డీజిల్ మీకు మంచి ఎంపిక. దీని ఎక్స్-షోరూమ్ ధర 11 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. నెక్సాన్ డీజిల్‌‌లో ప్యూర్ 1.5-లీటర్ ఇంజన్ ఉంది. ఈ ఎస్‌యూవీ ఒక లీటర్‌లో 24కిమీల మైలేజీని ఇస్తుంది. భద్రతలో 5 స్టార్ రేటింగ్‌ను కూడా సాధించింది. మీరు నెక్సాన్‌లో చాలా మంచి ఫీచర్‌లను చూస్తారు. స్పేస్ కూడా బాగుంది. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉన్నాయి. నెక్సాన్ డిజైన్ మిమ్మల్ని కొంచెం నిరాశకు గురి చేస్తుంది.

Hyundai Venue

హ్యుందాయ్ వెన్యూ ఒక శక్తివంతమైన డీజిల్ ఎస్‌యూవీ. ఇది చాలా మంచి ఫీచర్లతో వస్తుంది. దీని ధర రూ.10.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారులో 1.5 లీటర్ CRDi డీజిల్ ఇంజన్ ఉంది, ఇందులో స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. భద్రత కోసం, ఈబీడీతో పాటు 6 ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉన్నాయి. వెన్యూలో చాలా మంచి ఫీచర్‌లు ఉంటాయి. రోజువారీ ఉపయోగంతో పాటు, మీరు దీన్ని లాంగ్ డ్రైవ్‌లలో కూడా ఉపయోగించవచ్చు. ఇది ఒక లీటర్‌పై 24.2 కి.మీ మైలేజీని అందిస్తుంది.

Tags:    

Similar News