Aston Martin: రూ. 9 కోట్లతో ఆస్టన్ మార్టిన్ వాన్‌క్విష్‌.. సూపర్ కార్ రెడీ.. దీని వేగం ఊహించగలరా..?

Aston Martin: ఆస్టన్ మార్టిన్ తన విలాసవంతమైన సూపర్ కార్ 2025 వాన్‌క్విష్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 9 కోట్ల ఎక్స్-షోరూమ్. ఆరు సంవత్సరాల తర్వాత పునరాగమనం చేసిన ఈ సూపర్‌కార్, మొదటిసారిగా గ్లోబల్ మార్కెట్‌కి సెప్టెంబర్ 2024లో పరిచయమైంది.

Update: 2025-03-25 16:33 GMT
Aston Martin

Aston Martin: రూ. 9 కోట్లతో ఆస్టన్ మార్టిన్ వాన్‌క్విష్‌.. సూపర్ కార్ రెడీ.. దీని వేగం ఊహించగలరా..?

  • whatsapp icon

Aston Martin: ఆస్టన్ మార్టిన్ తన విలాసవంతమైన సూపర్ కార్ 2025 వాన్‌క్విష్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 9 కోట్ల ఎక్స్-షోరూమ్. ఆరు సంవత్సరాల తర్వాత పునరాగమనం చేసిన ఈ సూపర్‌కార్, మొదటిసారిగా గ్లోబల్ మార్కెట్‌కి సెప్టెంబర్ 2024లో పరిచయమైంది. ఇప్పుడు భారతీయ మార్కెట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఆస్టన్ మార్టిన్ ఈ హై పర్ఫామెన్స్‌డ్ గల కారులను సంవత్సరానికి 1,000 యూనిట్లను మాత్రమే తయారు చేస్తుంది. ఇది దాని ప్రత్యేకతను మరింత పెంచుతుంది.

2025 వాన్‌క్విష్‌లో 5.2-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V12 పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 823 బిహెచ్‌పి పవర్,1000 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సూపర్‌కార్ కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 344 కిమీ. ఇందులో 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఉంది. ఇది వెనుక చక్రాలకు మాత్రమే శక్తిని పంపుతుంది, మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని,పనితీరును అందిస్తుంది.

వాన్‌క్విష్ డిజైన్ చాలా స్పోర్టీగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని ముందు భాగంలో క్లాసిక్ ఆస్టన్ మార్టిన్ స్టైల్ గ్రిల్ ఉంది, ఇది శక్తివంతమైన రూపాన్ని ఇస్తుంది. మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు విజిబిలిటీని పెంచడమే కాకుండా దాని ఉనికిని మరింత ఆకట్టుకునేలా చేస్తాయి. అదనంగా యూవీ ప్రొటక్షన్‌తో కూడిన పనోరమిక్ సన్‌రూఫ్ అందించారు. ఇది క్యాబిన్‌కు ప్రీమియం, ఓపెన్ ఫీల్‌ని జోడిస్తుంది.

ఈ సూపర్‌కార్ క్యాబిన్ లగ్జరీ, సాంకేతికతకు ఖచ్చితమైన సమ్మేళనంగా ఉంది. ప్రీమియం, ఫ్యూచరిస్టిక్ అప్పీల్‌ని ఇస్తుంది. ఇందులో 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంది. ఇది ముఖ్యమైన డ్రైవింగ్ డేటాను స్పష్టంగా చూపుతుంది. అలానే 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆధునిక కనెక్టివిటీ ఫీచర్‌లతో ఉంటుంది. ప్రీమియం మెటీరియల్స్ దాని ఇంటీరియర్‌లో ఉపయోగించారు. ప్రతి డ్రైవ్‌ను స్టైలిష్‌గా, సౌకర్యవంతంగా చేస్తుంది.

2025 వాన్‌క్విష్ ఛాసిస్ DBS 770 అల్టిమేట్ కంటే 75శాతం బలంగా తయారు చేశారు. దాని నిర్మాణ దృఢత్వం, భద్రతను మెరుగుపరుస్తుంది. మెరుగైన స్థిరత్వం కోసం వీల్‌బేస్ 80 మిమీ పెరిగింది. దీని కారణంగా అధిక వేగంతో కూడా కారు నియంత్రణ అద్భుతంగా ఉంటుంది. అదనంగా ఇంజిన్ క్రాస్ బ్రేస్, పెద్ద యాంటీ-రోల్ బార్‌లు దీనిని మరింత ప్రతిస్పందించేలా చేస్తాయి. డ్రైవింగ్ అనుభవాన్ని మరింత షార్ప్‌గా చేస్తాయి. బిల్‌స్టెయిన్ DTX డంపర్‌లు ఉపయోగించారు. ఇవి మృదువైన,నియంత్రిత ప్రయాణాన్ని నిర్ధారిస్తాయి. ఆస్టన్ మార్టిన్ 2025 వాన్‌క్విష్ గ్లోబల్ డెలివరీలు 2025 నాలుగో త్రైమాసికంలో (Q4) ప్రారంభమవుతాయి.

Tags:    

Similar News