Renault Kiger Facelift: కొత్త లుక్‌లో రెనాల్ట్ కైగర్.. అదిరే ఫీచర్స్.. ధర రూ. 7.9 లక్షలు
Renault Kiger Facelift: భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోంది.

Renault Kiger Facelift: కొత్త లుక్‌లో రెనాల్ట్ కైగర్.. అదిరే ఫీచర్స్.. ధర రూ. 7.9 లక్షలు
Renault Kiger Facelift: భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త మోడల్స్ వేగంగా లాంచ్ అవుతున్నాయి. కార్ల కంపెనీలు ఈ విభాగంపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పుడు రెనాల్ట్ కైగర్ కొత్త అవతార్‌లో రూ. 6 లక్షల నుండి ఈ విభాగంలో పోటీ పడబోతోంది. ఇటీవల ఇది పరీక్ష సమయంలో కనిపించింది. ఈ వాహనంపై కంపెనీ వేగంగా పని చేస్తోంది. కొత్త కైగర్ టాటా పంచ్‌తో పోటీపడుతుంది. కొత్త కైగర్‌లో ఎటువంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం.
ఈసారి కొత్త రెనాల్ట్ కైగర్‌లో చాలా పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి. ఎక్స్‌టీరియర్ డిజైన్ నుండి ఇంటీరియర్ వరకు కొత్తదనం కనిపిస్తుంది. ఇందులో 1.0L న్యాచురల్ పెట్రోల్ ఇంజన్, 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్‌తో కూడిన రెండు ఇంజన్లు ఉన్నాయి. ఇది కాకుండా మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో తీసుకొచ్చారు.
కొత్త కైగర్‌లో భద్రత కోసం అనేక మంచి ఫీచర్‌లను చూడచ్చు. EBD, 6 ఎయిర్ బ్యాగ్స్, 3 పాయింట్ సీట్ బెల్ట్, EPS, స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ హిల్ హోల్డ్, డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లను ఈ కారులో చూడచ్చు. కొత్త కిగర్ అంచనా ధర రూ.6 లక్షల నుండి మొదలవుతుంది.
రెనాల్ట్ కొత్త కైగర్ నేరుగా టాటా పంచ్‌తో పోటీపడుతుంది. పంచ్ ధర రూ.6.13 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. క్రాష్ టెస్ట్‌లలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించిన మొదటి ఎస్‌యూవీ. ఈ కారులో 5 మంది కూర్చునే అవకాశం ఉంది. చిన్న కుటుంబాలకు ఇది మంచి ఎంపిక. ఈ కారులో ముందు 2 ఎయిర్‌బ్యాగ్స్, 15 అంగుళాల టైర్లు, ఇంజిన్ స్టార్ట్ స్టాప్, 90 డిగ్రీల ఓపెనింగ్ డోర్లు, సెంట్రల్ లాకింగ్ కీ, వెనుక పార్కింగ్ సెన్సార్, ABS+EBD, ఫ్రంట్ పవర్ విండో, టిల్ట్ స్టీరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.