Mercedes-Benz EQS Electric SUV: సింగిల్ ఛార్జ్‌పై 809 కిమీ మైలేజ్.. లెవల్ 2 అడాస్.. సేఫ్టీ ఫీచర్లు ఓ రేంజ్‌లో ఉన్నాయి..!
Mercedes-Benz EQS Electric SUV: బెంజ్ EQS Electric SUVని త్వరలో లాంచ్ చేయనుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 809 కిమీ రేంజ్ ఇస్తుంది. ఇందులో 5 మంది కూర్చునే స్థలం ఉంది.
Mercedes-Benz EQS Electric SUV: ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. ఈవీ మార్కెట్‌లో దిగ్గజ కంపెనీలు పోటీపడి సరికొత్త కార్లను తీసుకొస్తున్నా యి. వినియోగదారుల అవసరాలను బట్టి కంపెనీలు తక్కువ నుంచి ఎక్కువ రేంజ్ వాహనాలను అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎక్కువ దూరం ప్రయాణించే లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు చేయాలనుకొనే వారికి మెర్సిడెజ్ బెంజ్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. Mercedes-Benz EQS ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ ఎస్‌యూవీ ఫీచర్లు, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.
మెర్సిడెస్-బెంజ్ ఇటీవల భారతదేశంలో తన కొత్త EQS SUVని పరిచయం చేసింది. ఇది సాధారణ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల నుండి చాలా భిన్నమైనది, ప్రత్యేకమైనది. దీని డిజైన్ పెద్ద ప్లస్ పాయింట్. దాని ఫ్యూచరిస్టిక్ డిజైన్ కారణంగా ఇది చాలా మందిని ఆకర్షిస్తోంది. కొత్త EQS SUV ముందు, వెనుక భాగంలో LED లైట్ బార్‌లతో పాటు LED హెడ్‌ల్యాంప్‌లతో వస్తుంది. ఇది ముందు భాగంలో LED టెయిల్‌లైట్లు, EQS బ్యాడ్జింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ కారులో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్, డ్యూయల్-టోన్ వీల్స్ ఉన్నాయి. డిజైన్, క్యాబిన్ పరంగా ఇది గొప్ప EV.
కొత్త EQS SUV క్యాబిన్ గురించి మాట్లాడితే MBUX హైపర్ స్క్రీన్ ఇందులో కనిపిస్తుంది. అలానే 3-స్పోక్ స్టీరింగ్ వీల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఫ్రీ-స్టాండింగ్ 12.3-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, 17.7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇంటీరియర్ చాలా ప్రీమియం, విలాసవంతమైనది. ఇది అనేక అధునాతన ఫీచర్లతో అమర్చబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ SUVలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, EBD, 9 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్ 2 ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇందులో 5 మంది కూర్చునే స్థలం ఉంది. ధర గురించి మాట్లాడితే ఈ ఎలక్ట్రిక్ SUV ఎక్స్-షో రూమ్ ధర రూ. 1.41 కోట్లు. ఈ ఎస్‌యూవీ 122kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. దాని ARAI- ధృవీకరించబడిన రేంజ్ 809 కిమీ. ఈ బ్యాటరీ ప్యాక్‌తో ఇది 536bhp పవర్, 858Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 200kW ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో,కేవలం 31 నిమిషాల్లో 10-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ కారు 4.7 సెకన్లలో 0-100కిమీల వేగాన్ని అందుకుంటుంది. ఇది దూర ప్రయాణాలకు కంఫర్ట్‌గా ఉంటుంది.