Top 5 Compact SUVs: సింహాల్లాంటి కార్లు.. తట్టుకోవడం కష్టమే.. చాలా చీప్ రేట్‌కే ఇస్తున్నారు..!

Top 5 Compact SUVs: మారుతి సుజికి, టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలను రూ. 7 లక్షల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Update: 2024-09-19 12:45 GMT

top 5 compact suvs in india

Top 5 Compact SUVs: ప్రస్తుతం దేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీల ట్రెండ్ నడుస్తోంది. వీటిని తక్కువ బడ్జెట్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇవి గ్రాండ్ లుక్‌తో పాటు మంచి స్పేస్, పవర్ ఫుల్ ఇంజన్ ఉంటుంది. మీరు సాధారణ కార్ల డ్రైవింగ్‌తో విసుగు చెందితే.. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలు సరైన ఎంపికగా ఉంటాయి. ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజికి, టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి మోడళ్లు ఉన్నాయి. ఈ క్రమంలో రూ. 7 లక్షల కంటే తక్కువ ధర కలిగిన 5 SUVల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతీ ఇగ్నిస్
మారుతి సుజుకి ఇగ్నిస్ ఒక కాంపాక్ట్ అర్బన్ SUV.యువతను దృష్టిలో ఉంచుకొని దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీని ధర రూ.6.96 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 1.2L లీటర్ VVT పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 61kW పవర్, 113Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది 21కిమీ మైలేజీని అందిస్తుంది.

ఇగ్నిస్ బయటి నుండి కాంపాక్ట్ అయినప్పటికీ ఇది మంచి స్పేస్ అందిస్తుంది. 5 మంది ఇందులో సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. రోజువారీ ఉపయోగం కాకుండా, ఇది లాంగ్ డ్రైవ్‌లలో కూడా నడుస్తుంది. భద్రత దృష్ట్యా ఇందులో ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మీరు హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ SUVల నుండి కొంచెం భిన్నమైనది కావాలనుకుంటే మారుతి ఇగ్నిస్ ప్రస్తుతానికి ఉత్తమ ఎంపిక.

హ్యుందాయ్ ఎక్స్‌టర్
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ప్రస్తుతం భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది కాంపాక్ట్, స్టైలిష్ కాంపాక్ట్ SUV. ఇందులో స్పేస్ బాగుంది. ఈ వాహనం గ్రాండ్ ఐ10 నియోస్ ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. ఇది 1.2L కప్పా పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 83 PS పవర్‌, 113.8 Nm టార్క్‌ రిలీజ్ చేస్తుంది.

ఇది 5 స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది 19.4 kmpl మైలేజీని అందిస్తుంది. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎక్సెటర్ 391 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. దీని ఎక్స్-షో రూమ్ ధర రూ. 6.13 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

టాటా పంచ్
ప్రస్తుతం పంచ్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ SUV.దీనికి 90 డిగ్రీల ఓపెన్ డోర్స్ ఉన్నాయి. మీరు దీనిలో చాలా మంచి స్థలాన్ని పొందుతారు. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 86 PS పవర్, 113 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది 20.1 KM/L మైలేజీని అందిస్తుంది. భద్రత కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు EBD, ఎయిర్‌బ్యాగ్‌లు వంటి భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో లగేజీని ఉంచేందుకు 366 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. దీని ఎక్స్-షో రూమ్ ధర రూ. 6.12 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

నిస్సాన్ మాగ్నెట్
మాగ్నైట్ ఒక నమ్మకమైన కాంపాక్ట్ SUV. దీని డిజైన్ నేటికీ కొత్తగా కనిపిస్తుంది. ఇందులో స్పేస్ కూడా చాలా బాగుంది. ఇది రెండు పెట్రోల్ ఇంజన్‌లతో వస్తుంది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 70 bhp పవర్, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే దాని 1.0-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ 97 bhp పవర్, 160 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది.

ఈ రెండు ఇంజన్లు 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటాయి. కాగా టర్బో పెట్రోల్ ఇంజన్‌లో సివిటి గేర్‌బాక్స్ సౌకర్యం ఉంది. ఇందులో లగేజీ ఉంచేందుకు 336 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఇది భద్రతలో 4 స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇది EBD తో ABS, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

రెనాల్ట్ కిగర్
కాంపాక్ట్ SUV కిగర్ కంపెనీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా ఇది నిజంగా గొప్ప కారు. ఇది 405 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. ఇది స్టైలిష్ కాంపాక్ట్ SUV. ఇది భద్రతలో 4 స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇంజన్ గురించి మాట్లాడితే ఇందులో 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 72 PS పవర్, 96 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది. ఇది 100 PS పవర్‌ని 160Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ రెండు ఇంజన్లు 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో అందించబడ్డాయి. భద్రత కోసం EBDతో కూడిన ABS, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇది లీటరుకు 18-20కిమీల మైలేజీని అందిస్తుంది. దీని ఎక్స్-షో రూమ్ ధర రూ. 5.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Tags:    

Similar News