Weekly Horoscope 14 July To 20 July 2024: వారఫలాలు.. ఈ రాశివారు కీలక విషయాల్లో మిత్రుల సలహాలు పాటిస్తే.. అంతా శుభమే..

Weekly Horoscope 14 July To 20 July 2024: వారఫలాలు.. ఈ రాశివారు కీలక విషయాల్లో మిత్రుల సలహాలు పాటిస్తే.. అంతా శుభమే..

Update: 2024-07-14 00:30 GMT

Weekly Horoscope 14 July To 20 July 2024: వారఫలాలు.. ఈ రాశివారు కీలక విషయాల్లో మిత్రుల సలహాలు పాటిస్తే.. అంతా శుభమే..

(14-07-2024 నుంచి 20-07-2024 వరకు)

 మేషం :

కార్యసాధనకు బాగా శ్రమించాల్సి వుంటుంది. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. పరిజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం అనుకూలిస్తుంది. చెప్పుడు మాటలు విని అపోహలు పెంచుకుంటారు. ఇరుగుపొరుగుపై దురభిప్రాయాలు ఏర్పడతాయి. స్వల్ప తగాదాలూ గోచరిస్తున్నాయి. అయిష్టమైన కార్యాలు చేయాల్సి వస్తుంది. అధికారులు, పెద్దల కోపానికి గురయ్యే సూచనా ఉంది. పైత్య సంబంధ సమస్యలుంటాయి. త్వరగా అలసిపోతారు. శత్రువులపై కన్నేసి ఉంచండి.

 వృషభం :

పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ధనలాభం ఉంది. వస్తు, వాహనాలు కొనే ప్రయత్నం అనుకూలిస్తుంది. శత్రువుల పీడ తొలగిపోతుంది. బంధుమిత్రుల సహకారం సంపూర్ణంగా అందుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం వృద్ధి చెందుతుంది. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. ఇరుగు పొరుగుతోనూ సఖ్యత ఏర్పడతుంది. వారం చివరలోకాస్త అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ముఖ్యంగా మనోద్రేకాన్ని అదుపులో ఉంచుకోవలి. జీర్ణ సంబంధ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.

 మిథునం :

ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవహారాల్లో శుభ ఫలితాలుంటాయి. ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన రీతిలో ఉంటాయి. బంధుమిత్రులను కలుస్తారు. తృప్తికరమైన సమయాన్ని గడుపుతారు. మానసికశాంతి లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. వ్యాపార భాగస్వాములతో లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులు అధికారుల మన్ననలు పొందుతారు. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. వాత సంబంధ సమ్యలుంటాయి.

 కర్కాటకం:

చేపట్టిన పనుల పూర్తికి ఆటంకాలను అధిగమించాల్సి వుంటుంది. ఆస్తి సంబంధ వ్యవహారాలు బెడిసి కొట్టే సూచన ఉంది. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. జరుగుతున్న పరిణామాల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో ఆత్మీయుల సూచనలను పాటించండి. నిరాశను దగ్గరకు రానివ్వకండి. వారాంతానికి పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఆర్థిక వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. పనుల్లో ప్రతిష్టంభన కూడా తొలగిపోతుంది. మీ కార్యదక్షతకు ప్రశంసలొస్తాయి. తల్లి ఆరోగ్యం జాగ్రత్త.

 సింహం :

కీలకమైన కార్యాలను వారం మొదట్లోనే ప్రారంభించండి. ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. అత్యవసర వేళల్లో మీ ధైర్యసాహసాలు ఉపకరిస్తాయి. సోదరులు అండగా ఉంటారు. ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. దగ్గరి ప్రదేశాలకు ప్రయాణాలుంటాయి. వారం మధ్యలో బుద్ధి నిలకడగా లేక, బంధువులతో విరోధం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. మీ తెలివితేటలకు సరైన గుర్తింపు ఉండదు. సంతాన వ్యవహారాలు చికాకు పెడతాయి. ధైర్యంగా ముందుకెళ్లండి.

కన్య :

మిశ్రమ ఫలితాలుంటాయి. శ్రమకు తగ్గ ఫలితం దక్కే సూచన లేదు. అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. నోటి దురుసుతనంతో కీలక వ్యవహారం చెడిపోతుంది. పైగా అకారణ విరోధాలు గోచరిస్తున్నాయి. ఇతరులతో వ్యవహరించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. వృథా ఖర్చులను అదుపు చేయాలి. కుటుంబంలో చికాకులు తలెత్తినా, బుద్ధి కుశలతతో పరిష్కరిస్తారు. ఆత్మీయుల కలయిక ఊరటనిస్తుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. ఆస్తి క్రయవిక్రయాలు వాయిదా వేయడం మంచిది.

తుల :

పనులు అనుకున్నరీతిలో సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. బంధువులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. నూతన విషయాలు తెలుస్తాయి. పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు అనుకూలమైన వారమిది. గౌరవం పెరుగుతుంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం వల్ల నిందలు భరించాల్సి వస్తుంది. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. కుటుంబ సౌఖ్యముంటుంది. కీలక వ్యవహారంలో అదృష్టం తోడవడంతో విశేష లాభాన్ని పొందుతారు.

 వృశ్చికం :

బాగా శ్రమించినా పనులు అనుకున్న స్థాయిలో పూర్తి కావు. అవసరానికి సరిపడినంత డబ్బు అందుతుంది. అదృష్టం తోడవడంతో క్లిష్టమైన సమస్య నుంచి బయట పడతారు. బంధువులను కలుస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. వాహన యోగం ఉంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృథా ఖర్చుల వల్ల అప్పులు చేయాల్సి వస్తుంది. ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. ముఖ్యంగా ఎవరికీ పూచీకత్తుగా ఉండకండి. కుటుంబ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.

 ధనుస్సు :

పనులు అనుకున్నట్లుగానే సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. సంతాన సంబంధ శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. కొత్త బంధాలు ఏర్పడతాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. భాగ్యారంభానికి అదృష్టం తోడవుతుంది. వృథా ఖర్చులు చికాకు పరుస్తాయి. బంధువుల ఆరోగ్యం కలవర పెడుతుంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. గౌరవం పెరుగుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. ఉత్సాహంగా గడుపుతారు. వీలైనంత మేర అనవసర ప్రయాణాలు మానుకోండి. ఆరోగ్యం బావుంటుంది.

 మకరం :

అంతటా అనుకూల ఫలితాలుంటాయి. అభీష్టం నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారందరికీ శుభప్రదంగా ఉంటుంది. పెద్దల ఆభిమానం చూరగొంటారు. స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త బంధాలు ఏర్పడతాయి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. సంతాన సంబంధ శుభ వార్తను వింటారు. వారం చివరలో వృథా ఖర్చులుంటాయి. ఇతరులతో వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

 కుంభం :

ఆశించిన ప్రయోజనాలు అందుతాయి. చిత్తశుద్ధితో చేసే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. మనోభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగస్తులు శుభవర్తమానం వింటారు. శత్రుపీడ తొలగిపోతుంది. మేలిమి అవకాశాలు అందివస్తాయి. కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నూతన పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. అప్పులు తీర్చే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఇతరుల నుంచి సహకారం లభిస్తుంది. గృహనిర్మాణం దిశగా ఆలోచనలు సాగుతాయి. ఖర్చులు తగ్గించాలి.

మీనం :

శ్రమానంతరమే విజయం లభిస్తుంది. ఆటంకాలను దాటాల్సి వస్తుంది. వృత్తి వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఇతరులతో విరోధం ఏర్పడినా విజయం మీవైపే ఉంటుంది. అధికారులు, పెద్దల ఆదరాభిమానాలను పొందుతారు. చక్కటి అవకాశాలు కలిసొస్తాయి. కొత్త బాధ్యతలను చేపడతారు. కుటుంబంలో చికాకులను పరిష్కరిస్తారు. కీర్తి వృద్ధి చెందుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. బలహీనతలను బయట పెట్టకండి. ఖర్చులు తగ్గించండి.


Full View


Tags:    

Similar News