వారఫలాలు.. మే 19 నుంచి 25 వరకూ రాశిఫలాలు
Weekly Horoscope: వారఫలాలు.. మే 19 నుంచి 25 వరకూ రాశిఫలాలు
(19-05-2024 నుంచి 25-05-2024 వరకు)
మేషం:
శుభ ఫలితాలు అందుకుంటారు. యత్నకార్యాలన్నింటా విజయం లభిస్తుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. కీలక సమయంలో బంధుమిత్రులు తోడుగా నిలుస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వస్తుప్రాప్తి ఉంది. వాహనయోగమూ గోచరిస్తోంది. విందుల్లో పాల్గొంటారు. శారీరక, మానసిక సుఖం లభిస్తుంది. అందరితోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు ఎంతో మేలు చేస్తాయి. గొడవలకు దూరంగా ఉండండి. జీర్ణ సంబంధ సమస్య ఉంటుంది. ఖర్చులు తగ్గించండి.
వృషభం:
అనువైన కాలం నడుస్తోంది. ఆటంకాలను తేలిగ్గా అధిగమిస్తారు. చేపట్టిన పనుల్లో సంపూర్ణ విజయం సాధిస్తారు. డబ్బు సమస్యలు తొలగిపోతాయి. వస్తు, వాహన యోగం ఉంది. నూతన విజ్ఞానాన్ని పొందేందుకు అనువైన కాలమిది. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి. బంధుమిత్రులు తోడుగా నిలుస్తారు. కుటుంబ వ్యవహారాల్లో సొంత తెలివితేటలు వద్దు. జీవితభాగస్వామి సూచనలు చికాకులను తొలగిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనవసరపు అనుమానాలు వద్దు. ఆరోగ్యం బావుంటుంది.
మిథునం:
ఆటంకాలను సమయస్ఫూర్తితో దాటేస్తారు. చేపట్టిన పనులు కాస్త నెమ్మదిగానే అయినా విజయవంతం అవుతాయి. అవసరమైన మేరకే డబ్బు అందుతుంది. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనువైన కాలం కాదు. అనవసరపు అనుమానాలు, నీచపు ఆలోచనలకు దూరంగా ఉండండి. బంధుమిత్రులు సహకరిస్తారు. శత్రువులపై విజయం సాధిసత్రు. సొంత తెలివితేటలు ప్రదర్శించకుండా ఆత్మీయుల సూచనలు పాటించండి. కీర్తి వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మాతృసమానుల ఆరోగ్యం కలవర పరుస్తుంది.
కర్కాటకం:
పనులు నెమ్మదిగా సాగుతాయి. ధనసంబంధ చికాకులుంటాయి. బుద్ధి నిలకడగా ఉండదు. అయినవారితోనే గొడవలు ఏర్పడతాయి. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. సోదరవర్గం తోడ్పాటు ఉపశమనంగా ఉంటుంది. కుటుంబంలో కొత్త సమస్యలు తలెత్తుతాయి. మీ తెలివితేటలకు సరైన గుర్తింపు ఉండదు. అనవసరపు జోక్యాల వల్ల అవమానాలు తప్పవు. అనవసర అనుమానాలు ఆలోచనలను వక్రమార్గం పట్టిస్తాయి. ఆత్మీయులతో సంభాషణలు నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి.
సింహం:
అకారణ విరోధాలు పెరుగుతాయి. పనులకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడతాయి. డబ్బుకి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. పూచీలు ఉండడం వల్ల నిందలు భరించాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల వ్యవహారం కూడా మానసిక అశాంతికి కారణమవుతుంది. వేళకు భోజనం ఉండదు. సోదరులు, మిత్రులు తోడుగా ఉండడంతో కీలక సమస్య పరిష్కారం అవుతుంది. కంటి సంబంధ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఆస్తి అమ్మే ప్రయత్నాలు అనుకూలించవు. ధైర్యసాహసాలతో ముందుకు సాగండి. విజయం లభిస్తుంది.
కన్య:
అనుకూలమైన వారమిది. ఆటంకాలను తేలిగ్గా దాటేస్తారు. అనుకున్నట్లుగానే పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగప్రాప్తి ఉంది. అన్ని రంగాల్లోని వారూ శుభఫలితాలను పొందుతారు. బంధుమిత్రులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. దగ్గరి ప్రయాణాలు ఆనందదాయకంగా ఉంటాయి. సోదర వర్గాన్ని కలుసుకుంటారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఇచ్చిన మాట తప్పడం వల్ల ఎదరయ్యే నిందను చాకచక్యంతో పరిష్కరిస్తారు. మిత్రులు తోడుగా నిలుస్తారు. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది.
తుల:
కార్యనిర్వహణలో అప్రమత్తంగా ఉండండి. తొందరపాటు వల్ల ఆస్తి నష్టపోయే వీలుంది. అవసరానికి సరిపడినంత డబ్బు సమకూరుతుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన సందర్భంలో అదృష్టం తోడవుతుంది. కుటుంబ వ్యవహారాలు సాఫీగానే సాగుతాయి.ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. నిందలు పడాల్సి వస్తుంది. మిత్రులతో కూడా విరోధం గోచరిస్తోంది. బాధ్యతల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. మానసిక అశాంతి ఏర్పడుతుంది. బద్ధకాన్ని వదిలి ఆత్మవిశ్వాసంతో సాగాలి.
వృశ్చికం:
శుభప్రదంగా ఉంటుంది. ఆకాంక్షలు నెరవేరతాయి. సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అయినవారితో విందుల్లో పాల్గొంటారు. సంతానం వృద్ధిలోకి రావడం ఆనందాన్నిస్తుంది. శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు. ఇతరులూ మీకు సహకరిస్తారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. ధనసంబంధ సమస్యలు తీరతాయి. అప్పులు తీర్చగలుగుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దుబారా ఖర్చులు తగ్గించండి. అసూయ, అనుమానాలను దూరం చేసుకుంటే మంచిది.
ధనుస్సు:
అన్నింటా అనుకూల ఫలితాలు దక్కుతాయి. మనోవాంఛలు నెరవేరతాయి. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి అధికారవృద్ధి గోచరిస్తోంది. చక్కటి అవకాశాలు అందివస్తాయి. అధికారులు, పెద్దల అభిమానాన్ని పొందుతారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. బంధువులను కలుస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శత్రువులు ముఖం చాటేస్తారు. గౌరవం పెరుగుతుంది.
మకరం:
పట్టింది బంగారంలా సాగుతుంది. చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. జీవితం పురోభివృద్ధి దిశగా సాగుతుంది. డబ్బు సమస్యలు తీరతాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. పోటీదారులను ఓడిస్తారు. బాధ్యతల నిర్వహణలో చక్కటి పేరును పొందుతారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ నడవడికతో పెద్దల అభిమానాన్ని పొందుతారు. ఇంట్లో అనువైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
కుంభం:
ఇష్టసిద్ధి ఉంది. చేపట్టిన పనులన్నీ అనుకూలంగా సాగుతాయి. శత్రువులను జయిస్తారు. అవసరానికి సరిడా డబ్బు సమకూరుతుంది. మేలిమి అవకాశాలు అందివస్తాయి. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఇంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. బంధువులను కలుస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. అనుమానాలు, అసూయలను దూరంగా ఉంచండి. స్వల్పతగాదాలు గోచరిస్తున్నందున అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. బలహీనతలను బయటపెట్టకండి. దైవకార్యాల్లో పాల్గొంటారు.
మీనం:
ఆచితూచి వ్యవహరించాలి. ఆటంకాలు ఏర్పడినా కార్యాలు సఫలం అవుతాయి. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ వ్యవహారాలను చక్కపెడతారు. బంధుమిత్రుల సహకారంతో కీలక సమస్య నుంచి గట్టెక్కుతారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. మనోద్రేకం వల్ల తగాదాలు వచ్చే సూచన ఉంది. మీ ప్రవర్తన పెద్దల ఆగ్రహానికి కారణమవుతుంది. అనుకున్న సౌకర్యాలు సమకూరక చికాకు పడతారు. ఇష్టంలేని పనులు చేయాల్సి వస్తుంది. పైత్య సంబంధ సమస్యలుంటాయి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మేలు.