Ugadi 2025: ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 2025-26.. వృషభ రాశివారికి అదృష్టం వరిస్తుంది..!
Ugadi Taurus 2025 Horoscope: వృషభ రాశివారికి ఈ సంవత్సరం బాగా యోగదాయకంగా ఉంటుంది. గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలుంటాయి.
ఆదాయం-11
వ్యయం- 5
రాజపూజ్యత-1
అవమానం-3
Ugadi Taurus 2025 Horoscope: వృషభ రాశివారికి ఈ సంవత్సరం బాగా యోగదాయకంగా ఉంటుంది. గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలుంటాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో స్తబ్ధతలు తొలగిపోతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పంతాలకు పోకుండా, ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. వివాహాది శుభకార్యాలను నిర్వహిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబానికి సంబంధించి, అడపాదడపా మానసిక ఆందోళనలు తలెత్తినా, ఎక్కువగా సంతోషకర వాతావరణమే ఉంటుంది. వివాహాది శుభకార్యాలు ఆశించినట్లే జరుగుతాయి. మాతృవర్గీయులతో అనుకోని కష్ట, నష్టాలు, విరోధాలు ఏర్పడే అవకాశాలున్నాయి.
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇవి మీ ఉన్నతికి, ఆర్థిక స్థిరత్వానికి దోహదం చేస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనూహ్యంగా ఆశించని సహకారాలు లభిస్తాయి. స్నేహితులు, కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారాన్ని పొందుతారు. దీర్ఘకాలంగా పెండింగులోని కార్యాలకు, సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. వారసత్వపు ఆస్తి తగాదాలు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
వృత్తి, ఉద్యోగాల్లోని వారికి అనుకూలం. ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు ఉన్నతాధికారుల గుర్తింపును పొందుతారు. నిరుద్యోగులకు సంవత్సరం ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంటుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వం కోసం బాగా కష్టపడాల్సి వుంటుంది. ప్రభుత్వరంగ ఉద్యోగులకు పదోన్నతి మరియు ఆశించిన స్థానాలకు స్థానచలనం ఉంటుంది
వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. భాగస్వాములతో సఖ్యత ఉంటుంది. కులవృత్తి, ఇతర వృత్తి సంబంధ వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలుంటాయి. వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టే వారికి అనుకూలంగా ఉంది. అయితే పెట్టుబడుల కోసం అప్పులు చేయడం శ్రేయస్కరం కాదు. షేర్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలను అందుకుంటారు.
రాజకీయ రంగాల్లోని వారికి చక్కటి అవకాశాలు కలిసివస్తాయి. అధినేతల మన్ననలను పొందుతారు. కీలక పదవులను పొందుతారు. అధికారిక హోదా పెరుగుతుంది. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండే గుణాన్ని అలవాటు చేసుకుంటే, మంచి పేరు ప్రతిష్టలను సొంతం చేసుకోగలుగుతారు.
విద్యార్థులకు అన్ని విధాలా అనుకూల ఫలితాలుంటాయి. పోటీ పరీక్షల్లో నిర్దేశించుకున్న స్థాయి ర్యాంకులను సాధిస్తారు. విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసివస్తాయి. బద్ధకం లేకుండా, పట్టుదలను వీడకుండా శ్రమించాలి.
వృషభరాశి వారు, మరిన్ని మెరుగైన ఫలితాలకు, పాపగ్రహ శాంతి నిమిత్తం, అనునిత్యం దత్తచరిత్ర పారాయణం, గణపతి, దుర్గాదేవిల ఆరాధన చేయడం మంచిది.