దీపావళి శుభాకాంక్షలు: నేటి మీ రాశిఫలాలు ఇలా..(31/10/2024)
Telugu Horoscope Today, October 31, 2024: దీపావళి శుభాకాంక్షలు: నేటి మీ రాశిఫలాలు ఇలా..
Telugu Horoscope Today, October 31, 2024: దీపావళి శుభాకాంక్షలు: నేటి మీ రాశిఫలాలు ఇలా..
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణ పక్షం
తిధి: చతుర్దశి మధ్యాహ్నం గం.3.52 ని.ల వరకు ఆ తర్వాత అమావాస్య
నక్షత్రం: చిత్త అర్ధరాత్రి గం.12.45 ని.ల వరకు ఆ తర్వాత స్వాతి
అమృతఘడియలు: సాయంత్రం గం.5.32 ని.ల నుంచి గం.7.20 ని.ల వరకు
వర్జ్యం: ఉదయం గం.6.44 ని.ల నుంచి గం.8.32 ని.ల వరకు
దుర్ముహూర్తం: ఉదయం గం.10.05 ని.ల నుంచి గం.10.51 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.2.41 ని.ల నుంచి గం. 3.27 ని.ల వరకు
రాహుకాలం: మధ్యాహ్నం గం.1.26 ని.ల నుంచి గం.2.52 ని.ల వరకు
సూర్యోదయం: తె.వా. గం. 6.14 ని.లకు
సూర్యాస్తమయం: సా. గం. 5.45 ని.లకు
మేషం
ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార భాగస్వామ్య వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక లబ్దిని పొందుతారు. సంతాన సంబంధ విషయాలు సంతృప్తినిస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి.
వృషభం
శుభ ఫలితాలను పొందుతారు. ధనలాభం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పోటీదారులపై విజయం సాధిస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. పుణ్య కార్యాలకు హాజరవుతారు.
మిథునం
కార్యసాధనలో అడ్డంకులను అధిగమించాల్సి వస్తుంది. ఇష్టకార్యం భంగమయ్యే వీలుంది. నిరాశను వీడి కష్టపడాలి. మనోవ్యధ కలుగుతుంది. వాత సంబంధ సమస్య ఉంటుంది. బద్ధకం వల్ల చిక్కులొస్తాయి.
కర్కాటకం
చేపట్టిన పనులు సగంలోనే నిలిచిపోయే పరిస్థితి ఉంది. వాహన సంబంధ లావాదేవీలను వాయిదా వేయండి. డబ్బుకి ఇబ్బంది వుంటుంది. రక్త సంబంధీకుల ఆరోగ్యం కలవర పెడుతుంది. మనసు నిలకడగా ఉండదు.
సింహం
యోగదాయకంగా ఉంటుంది. కీలక సమయంలో చక్కటి ధైర్యసాహసాన్ని ప్రదర్శిస్తారు. సోదరులు తోడుంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. బంధాలు బలపడతాయి. ఆత్మీయులతో విందుకు వెళతారు.
కన్య
బ్యాంకు లావాదేవీలు చికాకు పెడతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు తొందరపాటు వద్దు. ముఖ్యంగా వేరేవాళ్ల వ్యవహారాల్లో తలదూర్చకండి. కుటుంబం గురించిన శ్రద్ధ అవసరం. మనసు కలవరంగా ఉంటుంది.
తుల
అనుకున్న రీతిలోనే పనులు సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. అదృష్టం వరిస్తుంది. శారీరక సౌఖ్యం లభిస్తుంది. విందుకు హాజరవుతారు. కీర్తి పెరుగుతుంది.
వృశ్చికం
కార్యనిర్వహణలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బద్ధకం వల్ల ఇబ్బందుల్లో పడతారు. బంధువులతోనే విరోధం గోచరిస్తోంది. దూర ప్రాంతానికి వెళ్లే సూచన ఉంది. వేళకు భోజనముండదు. విపరీతమైన ఖర్చులుంటాయి.
ధనుస్సు
కోరిక నెరవేరుతుంది. ఆదాయం పెరుగుతుంది. తోటివారి సాయం ఉపకరిస్తుంది. ఇష్టమైన వారితో విందుకు హాజరవుతారు. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మనశ్శాంతి ఉంటుంది.
మకరం
పనులన్నీ సఫలం అవుతాయి. పెద్దల ఆదరాభిమానాలను పొందుతారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. కీర్తి పెరుగుతుంది.
కుంభం
అడ్డంకులను దాటాల్సి ఉంటుంది. ఉన్నత విద్యకు చేసే ప్రయత్నాల్లో జాప్యం ఏర్పడుతుంది. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సంప్రదాయాలపై ఆసక్తి పెరుగుతుంది. తండ్రితో విబేదాలొస్తాయి. కడుపులో సమస్య వస్తుంది.
మీనం
పనులేవీ సవ్యంగా సాగవు. అనుకోని అవరోధాలు చికాకు పెడతాయి. ఇతరులపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. తగాదాలకు ఆస్కారముంది. పోటీల్లో ప్రత్యర్థులే గెలుస్తారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.