Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (29/10/2024)
Telugu Horoscope Today, October 29, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.
Telugu Horoscope Today, October 29, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణ పక్షం.
తిధి: ద్వాదశి ఉదయం గం.10.31 ని.ల వరకు ఆ తర్వాత త్రయోదశి.
నక్షత్రం: ఉత్తర సాయంత్రం గం.6.34 ని.ల వరకు ఆ తర్వాత హస్త.
అమృతఘడియలు: ఉదయం గం.10.25 ని.ల నుంచి గం.12.13 ని.ల వరకు.
వర్జ్యం: అర్ధరాత్రి దాటిన తర్వాత గం.4.04 ని.ల నుంచి గం.5.53 ని.ల వరకు.
దుర్ముహూర్తం: ఉదయం గం.8.32 ని.ల నుంచి గం.9.18 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.10.45 ని.ల నుంచి గం.11.35 ని.ల వరకు.
రాహుకాలం: మధ్యాహ్నం గం.2.53 ని.ల నుంచి గం.4.19 ని.ల వరకు.
సూర్యోదయం: తె.వా. గం. 6.14 ని.లకు.
సూర్యాస్తమయం: సా. గం.5.46 ని.లకు.
మేషం
అడ్డంకులు తొలగిపోతాయి. ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక లబ్దిని పొందుతారు. శత్రుపీడ తగ్గుతుంది. మనస్థైర్యం పెరుగుతుంది. ఆరోగ్యంబావుంటుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. పోటీల్లో విజయం లభిస్తుంది.
వృషభం
కీలక సమయంలో బుద్ధి చురుగ్గా పనిచేయదు. ఆటంకాల వల్ల అభీష్టం నెరవేరదు. అనవసర జోక్యాల వల్ల విరోధం ఏర్పడుతుంది. ఆలోచనలను అదుపు చేయాలి. ధననష్టం ఉంది. వాత సంబంధ సమస్య ఉంటుంది.
మిథునం
పనునలు సవ్యంగా సాగక పోవడం వల్ల ఒత్తిళ్లు పెరుగుతాయి. బుద్ధి నిలకడగా ఉండదు. అయినవారితోనే గొడవలు పెరుగుతాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. మీ వెన్నంటి వుండే వారివల్లే ఇబ్బంది వస్తుంది.
కర్కాటకం
వ్యవహారాలన్నింటా శుభ ఫలితాలుంటాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. సహచరులు అండగా ఉంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది.
సింహం
అనుకున్నవి సజావుగా సాగవు. ఇతరుల వల్ల ఇబ్బందులొస్తాయి. హామీలను నిలుపుకోలేరు. నిజాయితీకి తగిన గుర్తింపు ఉండదు. విడాకులు, రెండో పెళ్లి వ్యవహారాలు వాయిదా వేయండి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త.
కన్య
చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం అవుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు యోగదాయకంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విందులకు వెళతారు. ప్రతిష్ట పెరుగుతుంది. కీలకమైన వేళ అదృష్టం వరిస్తుంది.
తుల
పనుల పూర్తికి బాగా కష్టపడాల్సి ఉంటుంది. అడుగడుగునా ఆటంకాలు వస్తాయి. దూర ప్రాంతానికి వెళ్లే సూచన ఉంది. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయకండి. వృథా ఖర్చుల వల్ల మనశ్శాంతి దూరమవుతుంది.
వృశ్చికం
రోజంతా సంతోషంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పనులు కూడా సజావుగా సాగుతాయి. ఆర్థిక చిక్కులుండవు. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. కోరిక తీరుతుంది. బంధాలు బలపడతాయి.
ధనుస్సు
స్థిర చిత్తంతో చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అభీష్టం నెరవేరుతుంది. వివాదాలు, పోటీలలో మీదే పైచేయిగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆరోగ్యం బావుంటుంది.
మకరం
పనులు నెమ్మదిగా సాగుతాయి. సంతానం తీరు కోపాన్ని తెప్పిస్తుంది. అశాంతికి గురవుతారు. బలహీనతలను అధిగమించాలి. దూర ప్రయాణం గోచరిస్తోంది. పెద్దల ఆశీస్సులను పొందుతారు. వివాదాల జోలికి వెళ్లకండి.
కుంభం
తొందరపాటు వల్ల ఇబ్బంది పడతారు. ఉద్యోగులు మాట పడాల్సి వస్తుంది. అనుకున్న సౌకర్యాలు సమకూరవు. ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. ఏ విషయంలోనూ పోటీ పడకండి. అజీర్తి సమస్య ఉంటుంది.
మీనం
శుభదాయకంగా ఉంటుంది. బంధు, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణం లాభసాటిగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక అంశాలు తృప్తినిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు.