Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (28/10/2024)
Telugu Horoscope Today, October 28, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.
Telugu Horoscope Today, October 28, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణ పక్షం.
తిధి: ఏకాదశి ఉదయం గం.7.50 ని.ల వరకు ఆ తర్వాత ద్వాదశి.
నక్షత్రం: పుబ్బ మధ్యాహ్నం గం.3.24 ని.ల వరకు ఆ తర్వాత ఉత్తర.
అమృతఘడియలు: ఉదయం గం.8.12 ని.ల నుంచి గం.10.00 ని.ల వరకు.
వర్జ్యం: రాత్రి గం.11.33 ని.ల నుంచి అర్ధరాత్రి గం.1.21 ని.ల వరకు.
దుర్ముహూర్తం: మధ్యాహ్నం గం.12.23 ని.ల నుంచి గం.1.09 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.2.42 ని.ల నుంచి గం.3.28 ని.ల వరకు.
రాహుకాలం: ఉదయం గం.7.40 ని.ల నుంచి గం.9.06 ని.ల వరకు.
సూర్యోదయం: తె.వా. గం. 6.13 ని.లకు.
సూర్యాస్తమయం: సా. గం. 5.46 ని.లకు.
మేషం
ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బద్ధకం వల్ల మరిన్ని చిక్కులొస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో హితుల సూచనలు పాటించండి. ఆలోచనలను అదుపులో ఉంచుకోండి. పొట్టకు సంబంధించిన సమస్య ఉంటుంది.
వృషభం
ప్రతి పనికీ అడ్డంకులు వస్తాయి. ఆలోచన విధానాన్ని సరిచేసుకోవాలి. దుందుడుకు స్వభావం పనికిరాదు. వృథాఖర్చులు పెరుగుతాయి. బంధువులో విరోధం గోచరిస్తోంది. వాహన సంబంధ చిక్కులు వచ్చే వీలుంది.
మిథునం
ప్రతి పనీ సఫలం అవుతుంది. మీ సూచనలు లాభసాటిగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. శుభవార్తను వింటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సహచరుల వల్ల లబ్దిని పొందుతారు. ఆత్మధైర్యం పెరుగుతుంది.
కర్కాటకం
కార్యనష్టం మనసుకి కష్టం కలిగిస్తుంది. మాట తప్పిన ఫలితంగా నింద భరించాల్సి వస్తుంది. బ్యాంకు లావాదేవీలు తృప్తినివ్వవు. విడాకుల వ్యవహారం ఫలించదు. తగాదాలు వద్దు. ఆరోగ్యం జాగ్రత్త.
సింహం
అదృష్టం వరిస్తుంది. ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. వాహనయోగం ఉంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. విందుకు హాజరవుతారు. ఉల్లాసంగా గడుపుతారు.
కన్య
దూర ప్రయాణం గోచరిస్తోంది. విపరీతమైన ఖర్చులుంటాయి. వ్యవహారాలు అనుకున్నట్లుగా సాగవు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించండి. కోర్టు వ్యవహారాలు నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
తుల
రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. ఇతరులూ సహకరిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వృశ్చికం
అభీష్టం నెరవేరుతుంది. ప్రయత్నించిన ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. ఇతరులతో పోటీల్లో మీకే విజయం దక్కుతుంది. ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. విందుకు హాజరవుతారు.
ధనుస్సు
పనులు అనుకున్నట్లుగా సాగకపోవడం ఆవేదనను కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అంత తృప్తికరంగా సాగవు. సంతానం తీరు కోపాన్ని తెప్పిస్తుంది. దూర ప్రయాణం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త.
మకరం
బలహీనతలను అదుపు చేసుకోవాలి. తప్పునకు భారీ దండన ఉంటుంది. పోటీలలో పరాజయం పొందుతారు. ఇతరులపై అపోహల వల్ల లాభం లేదు. తగాదాలకు ఆస్కారముంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త.
కుంభం
ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి. విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అనువుగా ఉంది. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణం లాభిస్తుంది. నిజాయితీకి గుర్తింపు లభిస్తుంది. విందుకు వెళతారు.
మీనం
వివాదాలు పరిష్కారం అవుతాయి. కార్యాలన్నింటా విజయం లభిస్తుంది. అవసరమైన డబ్బు సమకూరుతుంది. బంధువులు సహకరిస్తారు. ప్రత్యర్థులపై గెలుస్తారు. మానసిక చిక్కులు తొలగిపోతాయి.