Marriage Remedies: పెళ్లి సంబంధాలు కుదిరినట్లే కుదిరి చెడిపోతున్నాయా.. ఈ పరిహారాలు చేయండి..!

Marriage Remedies: ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు సకాలంలో పెళ్లిళ్లు చేసి వారిని ఒకింటివారిని చేయాలని అనుకుంటారు. కానీ పరిస్థితులు అనుకూలించవు.

Update: 2024-01-19 15:00 GMT

Marriage Remedies: పెళ్లి సంబంధాలు కుదిరినట్లే కుదిరి చెడిపోతున్నాయా.. ఈ పరిహారాలు చేయండి..!

Marriage Remedies: ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు సకాలంలో పెళ్లిళ్లు చేసి వారిని ఒకింటివారిని చేయాలని అనుకుంటారు. కానీ పరిస్థితులు అనుకూలించవు. పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు కొన్ని కుదిరినట్లే కుదిరి చెడిపోతుంటాయి. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. మానసిక క్షోభను అనుభవిస్తారు. అయితే కొడుకు, కుమార్తె వివాహం ఆలస్యం కావడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిని తెలుసుకుని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. చాలాసార్లు జాతకంలో కొన్ని దోషాలు ఏర్పడి వివాహం ఆలస్యం అవుతుంది.

సకాలంలో వివాహం జరగకపోవడం ఒకవేళ జరిగినా ఆ బంధంలో గొడవలు రావడం, విడాకుల వరకు వెళ్లడం జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో జ్యోతిష్యం ప్రకారం కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. వివాహం ఆలస్యమైతే యువకుడు లేదా యువతి గురువారం స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీటిలో చిటికెడు పసుపు లేదా కుంకుమను కలుపుకోవాలి. ఈ ప్రక్రియను 12 గురువారాలు నిరంతరంగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోయి బృహస్పతి అనుగ్రహంతో త్వరలో వివాహం జరుగుతుంది.

తల్లిదండ్రులు వారి పిల్లల పెళ్లిళ్లు ఆలస్యమవుతుంటే గురువారం ఆవుకి రొట్టెలు తినిపించాలి. వాటికి కొంచెం పసుపు, బెల్లం, దేశీ నెయ్యి కలిపి తినిపించాలి. వరుసగా ఆరు గురువారాలు ఇలా చేస్తే మీ బిడ్డకు త్వరలో పెళ్లి అవుతుంది. పసుపు రంగు బట్టలు, పసుపు రుమాలు, పసుపు రంగు వస్తువులను ఎల్లప్పుడూ పర్సులో పెట్టుకోవాలి. మీరు నివసించే గది లోపల ఒక గుడ్డలో కొంచెం పసుపు ముద్ద కట్టి ఉంచుకోవాలి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Tags:    

Similar News