Astro News: శని ప్రభావం వల్ల 2024లో ఈ 3 రాశులకు చాలా ఇబ్బంది.. అవేంటంటే..!
Astro News: డిసెంబర్ ముగిసిన వెంటనే జనవరితో నెలతో కొత్త సంవత్సరం 2024 ప్రారంభంకానుంది. ఈ సంవత్సరంలో శని ప్రభావం వల్ల మూడు రాశులవారికి చాలా ఇబ్బంది కలుగుతుంది.
Astro News: డిసెంబర్ ముగిసిన వెంటనే జనవరితో నెలతో కొత్త సంవత్సరం 2024 ప్రారంభంకానుంది. ఈ సంవత్సరంలో శని ప్రభావం వల్ల మూడు రాశులవారికి చాలా ఇబ్బంది కలుగుతుంది. శని రెండున్నరేళ్లలో తన గమనాన్ని ఎప్పటికప్పుడు మారుస్తాడు. 2024లో జూన్ 30 నుంచి తిరోగమనం చెందుతుంది. ఈ 5 నెలల శని తిరోగమన ప్రభావం కొన్ని రాశులపై చెడు ప్రభావం చూపుతుంది. అందులో కుంభరాశిపై అధిక ప్రభావం ఉంటుంది. 2024లో శనిదేవుడు ఏ రాశుల వారిని ఎక్కువగా ఇబ్బందిపెడతాడో ఈ రోజు తెలుసుకుందాం.
శనిదేవుడు కుంభరాశిలో ఉండటం వల్ల కర్కాటక రాశి, వృశ్చిక రాశుల వారు ఎక్కువగా ప్రభావితమవుతారు. శని తిరోగమన స్థితిలో ఉన్నప్పుడు ఈ వ్యక్తులు మరింత కష్టపడవలసి ఉంటుంది. ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారి తల్లి ఆరోగ్యం కూడా బాగుండదు. కాబట్టి తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. అదృష్టం లేకపోవడం వల్ల పనులు పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మోకాలు లేదా కీళ్లకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థిక నష్టం ఉంటుంది. ఇంట్లోకి డబ్బు రాక తగ్గుతుంది.
కుంభంపై అధిక ప్రభావం
కుంభ రాశిలో శనిదేవుడు వ్యతిరేక దిశలో సంచరిస్తాడు. ఇలా చేయడం వల్ల కుంభరాశితో సహా మరో రెండు రాశులపై చెడు ప్రభావం పడుతుంది. కుంభరాశి వారిపై అత్యంత బాధాకరమైన దశ ఉంటుంది. కాబట్టి కుంభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తులు వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారంలో విజయం ఉండదు. ఒత్తిడిని ఎదుర్కొంటారు.