Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ధనలాభంతోపాటు వ్యక్తిగత ప్రతిష్టకు ఢోకా లేదు..

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ధనలాభంతోపాటు వ్యక్తిగత ప్రతిష్టకు ఢోకా లేదు..

Update: 2024-05-17 00:30 GMT

(తేది: 17-05-2024, శుక్రవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, శుక్ల పక్షం

తిధి : నవమి ఉదయం గం.8.48 ని.ల వరకు ఆ తర్వాత దశమి

నక్షత్రం: పుబ్బ రాత్రి గం.9.18 ని.ల వరకు ఆ తర్వాత ఉత్తర

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.2.05 ని.ల నుంచి గం.3.53 ని.ల వరకు

వర్జ్యం: మే 18 తె.వా.గం.5.26 ని.ల నుంచి ఉదయం గం.7.14 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.19 ని.ల నుంచి గం.9.11 ని.ల వరకు ఆ తర్వాత మధ్యాహ్నం గం.12.39 ని.ల నుంచి గం. 1.31 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.10.35 ని.ల నుంచి గం.12.13 ని.ల వరకు

సూర్యోదయం : ఉదయం గం.5.44 ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం గం.6.42 ని.లకు


మేషం :

అభీష్టం నెరవేరేందుకు బాగా శ్రమించాలి. ఆలోచనల తీరును మార్చుకోండి. ఇతరుల వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. ఖర్చులనూ బాగా అదుపు చేయాలి. వాత సంబంధ సమస్య ఇబ్బంది పెట్టే వీలుంది.


వృషభం :

భూ సంబంధ వ్యవహారాలు సవ్యంగా సాగవు. బంధువుల నుంచి తగిన సహకారం అందదు. డబ్బుకీ కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. జీవిత భాగస్వామి వృత్తిపై ఆందోళన పెరుగుతుంది. దుర్గమ్మను పూజించండి.


మిథునం :

అన్ని వైపులా శుభ ఫలితాలే అందుతాయి. ఆదాయం కూడా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ శాంతి ఉంటుంది. సోదరుల ప్రతిష్ట పెరగడం ఆనందాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీలకసమాచారం అందుతుంది. 


కర్కాటకం:

కుటుంబ సమస్యలపై శ్రద్ధ వహిస్తారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. బ్యాంకు లావాదేవీలు సవ్యంగా సాగవు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. వేళకు భోజనం ఉండదు. గణపతిని పూజించండి.


సింహం:

అన్ని రంగాల వారికీ యోగదాయకంగా ఉంది. ధనలాభం ఉంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. భాగస్వాములతో సఖ్యత ఏర్పడుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. మానసిక శాంతిని పొందుతారు.


కన్య:

తలపెట్టిన పనులకు ఇబ్బందులు తప్పవు. దూర ప్రయాణం గోచరిస్తోంది. బంధువుల వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి రావచ్చు. మిత్రుల వ్యవహారాల్లో జాగ్రత్త. బద్ధకాన్ని దూరం చేసుకోండి. 


తుల:

కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఆకాంక్షలు నెరవేరతాయి. అవసరమైన సదుపాయాలను ఏర్పరచుకుంటారు. కొత్త బాధ్యతలను స్వీకరించే సూచన ఉంది. సంతాన వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి.


వృశ్చికం:

అన్నింటా అనుకూలంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు, ప్రమోషన్లు సూచిస్తున్నాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. శత్రువులను కట్టడి చేస్తారు. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. సుఖప్రాప్తి ఉంది


ధనుస్సు:

పనుల్లో జాప్యం అశాంతికి కారణమవుతుంది. వృథా ఖర్చులుంటాయి. బలహీనతల వల్ల ఇబ్బంది. పిత్రార్జిత ఆస్తి వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. ధర్మకార్యాల్లో పాల్గొంటారు. కనకదుర్గను పూజించండి. 


మకరం:

నిర్దేశిత పనులు సవ్యంగా సాగక చికాకు పెరుగుతుంది. అనుమానాలు చెడు మార్గం పట్టిస్తాయి. ఇతరులపై చెడు అభిప్రాయాలు వద్దు. స్వల్ప తగాదాలు గోచరిస్తున్నాయి. జీర్ణ సంబంధ సమస్య ఉంటుంది.


కుంభం:

అన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. ధనలాభం ఉంది. నూతన విజ్ఞానం పొందేందుకు అనువైన రోజు. బంధుమిత్రులను కలుస్తారు. ప్రయాణాలు ఆనందకరంగా ఉంటాయి. 


మీనం:

కార్యజయం ఉంది. కీలక వ్యవహారంలో బంధుమిత్రుల తోడ్పాటు లభిస్తుంది. కొత్త వస్తువులను కొంటారు. రుణదాతల ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.

Tags:    

Similar News