Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి కొత్త పరిచయాలతో ఊహించని లాభం..

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి కొత్త పరిచయాలతో ఊహించని లాభం..

Update: 2024-05-16 00:30 GMT

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి కొత్త పరిచయాలతో ఊహించని లాభం..

(తేది: 16-05-2024, గురువారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, శుక్ల పక్షం

తిధి : అష్టమి ఉదయం గం.6.22 ని.ల వరకు, ఆ తర్వాత నవమి

నక్షత్రం: మఖ సాయంత్రం గం. 6.14 ని.ల వరకు ఆ తర్వాత పుబ్బ

అమృతఘడియలు: సాయంత్రం గం.3.33 ని.ల నుంచి గం.5.20 ని.ల వరకు

వర్జ్యం: మే 17 తె.వా. గం 3.15 ని.ల నుంచి గం.5.04 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.10.03 ని.ల నుంచి గం.10.55 ని.ల వరకు ఆ తర్వాత మధ్యాహ్నం గం.3.14 ని.ల నుంచి సాయంత్రం గం.4.06 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.1.50 ని.ల నుంచి గం.3.27 ని.ల వరకు

సూర్యోదయం : ఉదయం గం.5.44 ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం గం.6.41 ని.లకు


మేషం : బద్ధకం వల్ల సమస్యలు వస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చితే నిందలు తప్పవు. అనుమానాలు, భయాందోళనలు వదిలిపెట్టండి. వాత సంబంధ ఇబ్బందులుంటాయి. శ్రీమన్నారాయణుడిని పూజించండి.


వృషభం : సొంత నిర్ణయాలు వద్దు. ఆత్మీయుల సూచనలు పాటించండి. డబ్బుకి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. తల్లి వైపు బంధువుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. గణపతిని పూజించండి.


మిథునం : సోదరులతో సఖ్యత ఉంటుంది. చేపట్టిన పని సఫలం అవుతుంది. విశేష లాభం గోచరిస్తోంది. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. విలువైన సమాచారం అందుతుంది. ఆత్మయుల కలయిక ఆనందాన్నిస్తుంది.


కర్కాటకం: కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి. బుద్ధికుశలతను ప్రదర్శించండి. అకారణ విరోధాలు సూచిస్తున్నందున ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త. వేళకు భోజనం ఉండదు. ఎవరికీ పూచీ ఇవ్వకండి.


సింహం: ఆనందమయంగా ఉంటారు. ధనలాభం ఉంది. శారీరక, మానసిక సౌఖ్యాలను పొందుతారు. వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనువుగా ఉంటుంది. కీలకమైన పనిలో అదృష్టం తోడవుతుంది.


కన్య: శత్రువులు మీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం తెచ్చే ప్రయత్నాలు చేస్తారు. మనసు కలతబారే ఘటనలు ఎదురవుతాయి. స్థిరచిత్తంతో ఉండండి. వ్యర్థ ప్రయాణాలు మానండి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.


తుల: యోగదాయకంగా ఉంటుంది. వివిధ మార్గాల్లో ఆదాయం సమకూరుతుంది. అన్నివైపుల తగిన సహకారం అందుతుంది. పురోభివృద్ధి దిశగా నిర్ణయాలు తీసుకుంటారు. గృహనిర్మాణ యత్నాల్లో కదలిక వస్తుంది.


వృశ్చికం: కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. పురోభివృద్ధి దిశగా చక్కటి అవకాశాలు లభిస్తాయి. పెద్దలు తోడుగా ఉంటారు. ఇంట్లో శాంతి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 


ధనుస్సు: దూర ప్రాంతానికి వెళ్లాల్సి రావచ్చు. సంతానంతో సఖ్యత ఉండదు. కలహాలు గోచరిస్తున్నాయి. మానసిక అశాంతి ఏర్పడుతుంది. డబ్బుకీ స్వల్ప ఇబ్బంది ఉంటుంది. నవగ్రహాలను ఆరాధించడం మేలు చేస్తుంది.


మకరం: అప్రమత్తంగా ఉండాలి. ఆలోచనలు వక్రమార్గంలో పట్టే సూచన ఉంది. తగాదాలకు దూరంగా ఉండండి. అధికారులు, పెద్దల కోపానికి గురవుతారు. ఇష్టంలేని పని చేయాల్సి వచ్చినా రాజీ ధోరణిలో వెళ్లండి.  


కుంభం: శుభప్రదంగా ఉంటుంది. అన్ని ప్రయత్నాలు సఫలం అవుతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. మనశ్శాంతి లభిస్తుంది. కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాలు ఆనందదాయకంగా సాగుతాయి.  


మీనం: అభీష్టం నెరవేరుతుంది. డబ్బు సమస్యలు తీరతాయి. కొత్త వస్తువులను కొంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. గౌరవం పెరుగుతుంది.

Tags:    

Similar News