AP News: ప్రతిపక్ష హోదా కోసం జగన్ పోరాటం.. స్పీకర్ నిర్ణయం కోసం మాజీ సీఎం ఎదురుచూపులు

AP News: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి లేఖ రాశారు.

Update: 2024-06-26 06:22 GMT

AP News: ప్రతిపక్ష హోదా కోసం జగన్ పోరాటం.. స్పీకర్ నిర్ణయం కోసం మాజీ సీఎం ఎదురుచూపులు

AP News: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి లేఖ రాశారు. అసెంబ్లీలో తమ పార్టీ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ఆయన తన లేఖ ద్వారా అసహనం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు జగన్ తను రాసిన లేఖలో మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధమని పేర్కొన్నారు.

తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్టున్నారని, అందులో భాగంగానే తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని, దాన్ని ఇప్పటివరకు ఎవరు పాటించలేదని జగన్ తెలిపారు.

చచ్చే దాకా కొట్టాలన్న స్పీకర్ మాటలు పార్లమెంటులో గానీ, ఉమ్మడి ఏపీలో గానీ ఎప్పుడూ ఈ నిబంధనలను పాటించలేదన్నారు జగన్... రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చేపట్టిన టీడీపీ అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే తన పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. చచ్చే దాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని పేర్కొన్న జగన్... ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీలో తన గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు.

ప్రతిపక్ష హోదాతోనే తమ వాయిస్ బలంగా వినిపించే అవకాశం ఉంటుందని, ప్రజాసమస్యల కోసం తాము అప్పుడే మాట్లాడగలుగుతామని జగన్ తెలిపారు. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్య లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారాయన... ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని లేఖను పరిశీలించాలని తాను కోరుతున్నానని జగన్ స్పీకర్‌కు జగన్ లేఖ రాశారు. వైఎస్‌ఆర్ సీపీ విపక్షంలో ఎక్కువ సీట్లు కలిగి ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరాన్ని జగన్ ఈ లేఖ ద్వారా స్పష్టం చేశారు.

అయితే జగన్ రాసిన లేఖపై శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏ విధంగా స్పందిస్తారు..? వైఎస్‌ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశంపై ఏం సమాధానం చెబుతాదనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News