YS Jagan: ఐదేళ్ల తర్వాత మళ్లీ మనదే అధికారం..

Jagan: ఎన్నికల ఫలితాలను చూసి నిబ్బరాన్ని కోల్పోవద్దని పార్టీ ఎమ్మెల్సీలకు ధైర్యం చెప్పారు వైఎస్ జగన్.

Update: 2024-06-13 13:30 GMT

YS Jagan: ఐదేళ్ల తర్వాత మళ్లీ మనదే అధికారం..

Jagan: ఎన్నికల ఫలితాలను చూసి నిబ్బరాన్ని కోల్పోవద్దని పార్టీ ఎమ్మెల్సీలకు ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. వైసీపీ ఐదేళ్ల పాలనలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 99శాతం వాగ్దానాలను అమలు చేశామని గుర్తు చేశారు. తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీలతో భేటీ అయిన జగన్.. ఫలితాల సరళి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళాసాధికారిత, సుపరిపాలన విషయంలో ఎప్పుడూ జరగని, చూడని సంస్కరణలు తీసుకొచ్చామన్నారు.

ఇవన్నీ చేసి చూపించి… ప్రజల మన్ననలను పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం కాని, ఎన్నికల్లో ఏమైందో తెలియదన్నారు జగన్. ఐదేళ్ల తర్వాత మళ్లీ మనదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో భాగస్వామ్యం అయిన చంద్రబాబు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగకపోవడం ఆయన పాపం పడింది అనడానికి నిదర్శనం అన్నారు జగన్. హనీమూన్ పీరియడ్ ముగిసేవరకూ వారికి టైం ఇద్దాం అన్నారు. దాడులకు గురైన కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే కార్యక్రమం చేద్దామని ఎమ్మెల్సీలకు సూచించారు జగన్. 

Tags:    

Similar News