Andhra Pradesh: నేడు రైతులకు మూడు విధాలుగా లబ్ధి చేయనున్న వైసీపీ సర్కార్
*3 పథకాల కింద రూ.2,190 కోట్ల లబ్ధి *నేరుగా రైతుల ఖాతాల్లో జమచేయనున్న సీఎం జగన్
Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వం ఇవాళ అన్నదాతలకు మూడు విధాలుగా లబ్ధి కలిగిస్తోంది. లక్ష రూపాయలలోపు రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు వైఎస్‌ఆర్ సున్నావడ్డీ పథకం అమలు చేస్తోంది. వైఎస్‌ఆర్ రైతుభరోసా, వైఎస్‌ఆర్ సున్నావడ్డీ, వైఎస్‌ఆర్ యంత్ర సేవాపథకం. మూడు పథకాలకు సంబంధించి 2వేల 190కోట్ల రూపాయలను సీఎం జగన్ రైతుల గ్రూపుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
వైఎస్‌ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ కింద రెండోవిడత పెట్టుబడి సాయంగా 50 లక్షల 37 వేల మంది రైతుల ఖాతాల్లో 2వేల 52కోట్ల రూపాయలను జమచేయనున్నారు. ఖరీప్ సీజన్‌కు సంబంధించి వైఎస్‌ఆర్ సున్నావడ్డీ రాయితీ కింద ఇవాళ సీఎం జగన్ 6లక్షల 67వేల మంది రైతులకు 112కోట్ల 70లక్షల రూపాయలను వారిఖాతాల్లో జమచేస్తున్నారు.
ఇక చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం వాటికి సంబంధించి సబ్సీడీ సొమ్ము 25కోట్ల 55లక్షల రూపాయలను నేడు రైతు గ్రూపులకు జమచేయనుంది. వైఎస్‌ఆర్ యంత్ర సేవాపథకం కింద గ్రామస్థాయిలో ఇప్పటికే 789 యంత్ర సేవా కేంద్రాలను ప్రారంభించగా, తాజాగా మరో వేయి 720 కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి.