Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఆదివారం, సోమవారం ఉరుములు, మెరుపులతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముంది తెలిపింది.
దక్షిణకోస్తాలో ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అటు ఒడిశా తీరం ప్రాంతంలో 3.6కి.మీ. నుంచి 5.8 కి.మీ ఎత్తున ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వెల్లడించిది. ఈ నేపథ్యంలో రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాబోయే రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. హైదరాబాద్‌లోనూ తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.