illegal Excavations in Quarries: క్వారీల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు.. జరిమానా విధిస్తున్న విజిలెన్స్ స్క్వాడ్

illegal Excavations in Quarries: అనుమతి ఉండేది గోరంత... తవ్వేది కొండంత... ఎక్కడైనా ఇది సాధారణమే. ఎవరైనా అధికారులు వచ్చి తనిఖీలు చేస్తే వారి బండారం బట్టబయలవుతుంది.

Update: 2020-07-12 05:30 GMT
Illegal Excavations in Quaries

illegal Excavations in Quarries: అనుమతి ఉండేది గోరంత... తవ్వేది కొండంత... ఎక్కడైనా ఇది సాధారణమే. ఎవరైనా అధికారులు వచ్చి తనిఖీలు చేస్తే వారి బండారం బట్టబయలవుతుంది. ఇలా ఇష్టారాజ్యంగా తవ్వడమే కాదు... సమీపంలో గ్రామాలున్నా పట్టించుకోరు... వారి ఇళ్లకు బీటలు పడ్డా... గ్రామంలోకి వీరు పేల్చిన రాళ్లు వచ్చి పడినా కనీసం పట్టించుకోరు... అరిచి గీ పెట్టినా వారి మాట వినరు. వారు మాత్రం ఏం చేస్తారు... మండల అధికారులు, పోలీసుల వద్దకు వెళ్తారు.. వారు వచ్చి చూస్తారు. అంతే ఇక ముందు జరిగేది ఏమీ ఉండదు.. ఇది సాధారణ విషయమే. ఇవి విశాఖ జిల్లా వ్యాప్తంగా అనకాపల్లి, రోలుగుంట మంఢలాల్లో ఇష్టారాజ్యంగా తవ్వుకుంటూ పోతున్నారు. గత నెలలో రోలుగుంటలో ఒక క్వారీకి చెందిన యాజమాని ఇదే మాదిరిగా తవ్వుకుంటూ పోతే అధికారులు వచ్చి కోటి కి మించి ఫైన్ వేశారు. వారు కడతారా? లేదో వేచి చూడాల్సిందే. ఇదే మాదిరి అనకాపల్లిలో రూ. 33కోట్లు జరిమానా విధించారు. ఈ కధ ఏ కంచికి చేరుతుందో వేచి చూడాల్సిందే.

పర్మిట్లకు మించి రాయి తవ్వకాలు నిర్వహించిన క్వారీ యాజమాన్యానికి గనుల శాఖ విజిలెన్స్‌ స్క్వాడ్‌ రూ.33,02,61,364 జరిమానా విధించింది. విజిలెన్స్‌ సహాయ సంచాలకులు ఆర్‌.ప్రతా్‌పరెడ్డి తెలిపిన వివరాలు... విశాఖ జిల్లా అనకాపల్లి మండలం సీతానగరం గ్రామంలో సర్వే నంబరు 251లో 7.05, 7.50 హెక్టార్లలలో వెంగమాంబ స్టోన్‌ క్రషర్‌ అండ్‌ క్వారీ పేరుతో వేర్వేరుగా పర్మిట్లు తీసుకున్నారు. 7.05 హెక్టార్లకు 2006 జూలై 18న తీసుకున్న పర్మిట్‌ వచ్చే ఏడాది జూలై 17 వరకు, 7.50 హెక్టార్లకు 2008 నవంబరు 7న తీసుకున్న పర్మిట్‌కు 2023 అక్టోబరు 7వ తేదీ వరకు అనుమతి ఉంది. 7.05 హెక్టార్లలో 70,030 క్యూబిక్‌ మీటర్లకు పర్మిట్‌ తీసుకోగా 3,41,708 క్యూబిక్‌మీటర్ల రాయి అంటే..పర్మిట్‌ కంటే 2,71,678 క్యూబిక్‌ మీటర్లు అధికంగా తవ్వినట్టు అధికారులు గుర్తించారు. దీనికి రూ.15,45,30,446లు జరిమానా విధించారు.

మరో పర్మిట్‌లో 7.50 హెక్టార్లల్లో 4,76,868 క్యూబిక్‌ మీటర్లకు అనుమతి తీసుకోగా 7,74,113 క్యూబిక్‌ మీటర్లు అంటే..పర్మిట్‌ కంటే 2,97,245 క్యూబిక్‌ మీటర్లు ఎక్కువగా తవ్వకాలు చేపట్టడంతో రూ. 16,90,73,114లు జరిమానా విధించారు. ఇదే గ్రామంలో సర్వే నంబరు 193లో 0.838 హెక్టార్లల్లో 3503 క్యూబిక్‌ మీటర్లు, సర్వే నంబరు 303లో 2.08 హెక్టార్లలో 8,202 క్యూబిక్‌ మీటర్ల రాయి తవ్వకాలకు పర్మిట్‌ తీసుకున్నా.... ఇంత వరకు ఎటువంటి తవ్వకాలు చేపట్టలేదు. దీంతో పర్మిట్లను దుర్వినియోగంచేసినట్టు అధికారులు గుర్తించారు. సర్వే నంబరు 193లో పర్మిట్‌కు సంబంధించి రూ.19,92,506, సర్వే నంబరు 303కు సంబంధించి రూ.46,65,298 జరిమానా విధించారు.



Tags:    

Similar News