Bishweswar Tudu: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గడువులోపు పూర్తి కాలేదు

Bishweswar Tudu: ఇప్పటి వరకు హెడ్ వర్క్స్‌ 77శాతం.. కుడికాల్వ పనులు 93శాతం పూర్తి

Update: 2022-07-19 13:00 GMT

Bishweswar Tudu: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గడువులోపు పూర్తి కాలేదు

Bishweswar Tudu: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గడువులోగా పూర్తికాలేదని కేంద్రమంత్రి బిశ్వేశ్వర్‌ తుడు రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2024 జూన్ నాటికి పూర్తిచేసే గడువు పొడిగించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీకమిటీ సూచించిందని పేర్కొన్నారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. 2022 ఏప్రిల్ నాటికే పోలవరం పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ నిర్ణీత గడువులోగా పూర్తికాలేదన్నారు.

ఇప్పటి వరకు హెడ్ వర్క్స్‌ 77శాతం కుడికాల్వ పనులు 93శాతం, ఎడమ కాల్వ పనులు 72 శాతమే పూర్తయ్యాయని వివరించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీని 2021 నవంబరులో నియమించామన్నారు. కమిటీ అధ్యయనం చేసి 2022 ఏప్రిల్‌లో నివేదికను సమర్పించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువును జూన్ 2024కు పొడిగించేందుకు సూచించిందన్నారు.

Full View


Tags:    

Similar News