అమరావతికి రైల్వే లైన్: రూ. 2,245 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
Amaravati Railway Line: అమరావతికి 57 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ ను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు.
Amaravati Railway Line: అమరావతికి 57 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ ను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు.రూ. 2,245 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. హైద్రాబాద్, కోల్ కతా, చెన్నైతో పాటు దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో అమరావతిని కలుపుతూ ఈ కొత్త రైల్వే ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై 3.2 కి.మీ. బ్రిడ్జి నిర్మిస్తారు. ఉత్తర, దక్షిణ, మధ్య భారత్ లోని పలు ప్రాంతాలను ఈ రైల్వే లైన్ అనుసంధానం చేయనుంది.
అమరావతి రైల్వే లైన్ డ్రీమ్ ప్రాజెక్టు అని దీన్ని కేంద్రం నెరవేర్చిందని కేంద్ర మంత్రి చెప్పారు.పవన్ చొరవతో రైల్వేలైన్ కు మోదీ ఆమోదం తెలిపారని ఆయన చెప్పారు. అమరావతికి రైల్వే కనెక్టివిటీ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని రైల్వే వైష్ణవ్ తెలిపారు. ఈ రైల్వే మార్గం ద్వారా మచిలీపట్టణం, కాకినాడ పోర్టులకు కూడా అనుసంధానం చేస్తోందని మంత్రి వివరించారు.