Srisailam: శ్రీశైలంలో ఈరోజు నుంచి ఉగాది మహోత్సవాలు
Srisailam: 5 రోజులపాటు కొనసాగనున్న ఉగాది మహోత్సవాలు
Srisailam: శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో ఈరోజు నుండి ఈనెల 10 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. 5రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తుల కోసం మంచినీరు, తదితర సౌకర్యాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయం ప్రాంగణమంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. లడ్డు ప్రసాదాలు, పెద్దఎత్తున అన్న ప్రసాద వితరణ సాంస్కృతిక కార్యక్రమాలు వంటి ఏర్పాట్లను ఏర్పాటు చేయడంపై ఈవో పెద్దిరాజు ప్రత్యేక దృష్టి సారించారు. మహోత్సవాలపై ఇప్పటికే పలు దఫాలుగా సమీక్ష సమావేశాలను నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా 17 భక్త బృందాల సహాయంతో జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు ఎస్పీ రఘువరన్ రెడ్డి జిల్లా అధికారుల సహాయ సహాకారాలతో ఉగాది మహోత్సవాలు విజయవంతం చేసేందుకు ఈవో పెద్దిరాజు ప్రత్యేక దృష్టిని సారించారు.
శ్రీశైల మహాక్షేత్రంలో జరిగే ఉగాది మహోత్సవాలకోసం దేవాదిదేవుడిని తనివితీరా దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గంలో పాదయాత్రగా కన్నడ భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. భ్రమరాంబికాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా, మల్లన్నను తమ ఇంటి అల్లునిగా కన్నడ భక్తులు భావించి పుట్టింటి నుంచి పసుపు కుంకుమ సారెను తీసుకువచ్చి సమర్పిస్తారు.
యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 7గంటలను బృంగి వాహనంపై ఆది దంపతులు పూజలందుకోనున్నారు. క్షేత్రపురవీధుల్లో అమ్మవార్లకు కన్నుల పండువగా గ్రామోత్సవం జరగనుంది. అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.