తిరుమల లో మార్చి 31 వ‌ర‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం నిలుపుద‌ల : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Update: 2020-03-23 15:00 GMT
TTD (File Photo)

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో భాగంగా మార్చి 31వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నాన్ని నిలుపుద‌ల చేస్తున్న‌ట్టు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లో సోమ‌వారం అద‌న‌పు ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల స్థానికుల ఆరోగ్య సంర‌క్ష‌ణను దృష్టిలో ఉంచుకుని మార్చి 24 నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చే వ‌ర‌కు రాత్రి 9 గంట‌ల నుండి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల - తిరుప‌తి మ‌ధ్య ఘాట్ రోడ్ల‌లో వాహ‌నాల రాక‌పోక‌ల‌పై నిషేధం విధించిన‌ట్టు తెలిపారు.

ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న రూ.300/- ద‌ర్శ‌న టోకెన్లు, ఆర్జిత‌సేవ‌లు, గ‌దుల‌ను భ‌క్తులు ర‌ద్దు చేసుకునే అవ‌కాశం క‌ల్పించామ‌ని, మార్చి 25వ తేదీ నుండి రీఫండ్ మొత్తాన్ని చెల్లిస్తామ‌ని వెల్ల‌డించారు. శ్రీ‌వారి ఆల‌యంలో మార్చి 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, మార్చి 25న ఉగాది ఆస్థానం సంద‌ర్భంగా పరిమిత సంఖ్యలో సిబ్బందిని అనుమ‌తించాల‌ని అధికారుల‌కు సూచించారు.


Tags:    

Similar News