తిరుమలపై కరోనా ఎఫెక్ట్.. తిరుమల ఘాట్ రోడ్ మూసివేత

Update: 2020-03-19 10:11 GMT

తిరుమలపై కరోనా ఎఫెక్ట్ పడింది. తిరుమల ఘాట్ రోడ్ మూసివేశారు. అలిపిరి టోల్‌గేట్ మూసివేసి వాహనాలను కొండపైకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి తోడు తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశం నిలిపివేశారు. రేపు ఉదయం నుంచి రెండు ఘాట్ రోడ్డులు మూసివేయనున్నారు. ఈ సాయంత్రం నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేత.

ఏపీలో కరోనా కలకలం రేగింది. శ్రీవారిని దర్శంచుకునేందుకు వచ్చిన ఒక వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి దర్శించుకుని తిరుమలకు వచ్చిన భక్తుడు ఒక్కసారి కళ్లు తిరిగి పడిపోయాడు. అతడిని దామెదరంగా గుర్తించారు. వెంటనే అలర్ట్ అయిన తిరుమల సిబ్బంది వెంటనే స్థానికంగా ఉన్న అశ్విని ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి అనంతరం రుయా ఆస్పత్రికి తరలించారు. అతడికి కరోనా లక్షణాలు ఉన్నాట్లు వైద్యులు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News