AP SSC Results 2023: జీరో రిజల్ట్స్...పాపం ఎవరిది..?

AP SSC Results 2023: అయితే సున్నా ఫలితాలు వచ్చిన పాఠశాలల జాబితాలో గుంటూరు జిల్లా కూడా ఉండడం విశేషం..

Update: 2023-05-08 10:39 GMT

AP SSC Results 2023: జీరో రిజల్ట్స్...పాపం ఎవరిది..?( ఫైల్ ఇమేజ్ )

AP SSC Results 2023: పదో తరగతి ఫలితాల్లో గుంటూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో సత్తా చాటింది. జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్, మున్సిపల్ స్కూల్స్ సంఖ్య అధికం కావడంతో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 6వ స్థానం దక్కింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పలువురు విద్యార్థులకు 593 మార్కులు వచ్చాయి. ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్ తో పోల్చితే ప్రైవేటులో అత్యధికమంది పాసైనా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఈసారి మంచి మార్కులు రావడంతోపాటు గతేడాది కన్నా ఉత్తీర్ణత శాతం పెరిగింది. అయితే సున్నా ఫలితాలు వచ్చిన పాఠశాలల జాబితాలో గుంటూరు జిల్లా కూడా ఉండడం విశేషం..

రాష్ట్ర వ్యాప్తంగా 38 పాఠశాలల్లో సున్నా ఫలితాలు వచ్చాయి. ఈ జాబితాలో గుంటూరు సమీపంలోని తాడికొండ మండలం లాం జడ్పీ ఉన్నత పాఠశాల సున్నా ఫలితం సాధించింది. ఈ పాఠశాల నుంచి మొత్తం 14 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. వీరిలో ఏఒక్కరూ ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఇలాంటి ప్రతికూల ఫలితాలు రావడానికి పాఠశాలకు రెగ్యులర్ హెచ్ ఎం లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక్కడ కేవలం 9మంది ఉపాధ్యాయులే ఉన్నారు. జీరో ఫలితాలపై ఉపాధ్యాయులందరికీ మెమోలు ఇచ్చేందుకు డిప్యూటీ ఈవో రెడీ అయ్యారు. అంతేకాదు, ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ సప్లిమెంటరీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా లాం జడ్పీ ఉన్నత పాఠశాలకు ఉపాధ్యాయులను పంపించనున్నారు.

Tags:    

Similar News