శ్రీశైలంలో ధర్మకర్తల మండలి 8వ సర్వసభ్య సమీక్ష సమావేశం
* ఈ సమావేశంలో మొత్తం 38 అంశాలతో ప్రతిపాదనలు ప్రవేశపెట్టగా.. 37 అంశాలకు ఆమోదం తెలిపి ఒక అంశాన్ని వాయిదా వేశారు.
Srisailam: శ్రీశైలంలో ధర్మకర్తల మండలి 8వ సర్వసభ్య సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఆలయ ఈవో ఎస్. లవన్న, మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొత్తం 38 అంశాలతో ప్రతిపాదనలు ప్రవేశపెట్టగా 37 అంశాలకు ఆమోదం తెలిపి ఒక అంశాన్ని వాయిదా వేశారు. ముఖ్యంగా సీఎం జగన్ ఆదేశాలతో తెల్లరేషన్ కార్డుదారులకు ప్రతినెలలో ఒక్కరోజు 250 జంటలకు ఒక్కొక్క పూజలో పాల్గొనేందుకు అవకాశం కల్పించామని చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలిపారు. స్వామివారి ఆలయ పడమటి వైపు గల ధ్వజస్తంభంపై రాగిరేకులకు సుమారు 2 . 50 కోట్ల వ్యయంతో బంగారు తాపడం వేయడానికి ఆమోదించమని.. అమ్మవారి ఆలయంలో అసంపూర్తిగా ఉన్న సలుమండపాలను కూడా పునరుద్ధరణ చేయడానికి నిర్ణయించామని వెల్లడించారు. క్షేత్ర పరిధిలో అధికారులు తెలియక స్థలాలు కేటాయించిన వాటిని పరిశీలించి... స్థలాలను వెనక్కి తీసుకుంటామని.. ఇప్పటికే వాటిపై పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు.