శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద.. ఇవాళ సాయంత్రం గేట్లు ఎత్తివేసే అవకాశం
* ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు * ప్రస్తుత నీటిమట్టం 879.30 అడుగులు
Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. రోజురోజుకూ ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తివేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 879 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 4 లక్షల 66 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో మధ్యాహ్నం లేదా సాయంత్రం గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు.