వీడియో: ఏనుగు పిల్లే కదా.. సెల్ఫీ దిగుదామనుకున్నారు.. ఏమి జరిగిందో చూడండి..

ఒక్కోసారి ఎవరో చేసిన అల్లరి పనికి ఇంకొకరు బాలి అవుతారు. సరిగ్గా అదే జరిగింది శ్రీకాకుళం-ఒడిశా సరిహద్దుల్లో.

Update: 2020-12-30 08:32 GMT

ఒక్కోసారి ఎవరో చేసిన అల్లరి పనికి ఇంకొకరు బాలి అవుతారు. సరిగ్గా అదే జరిగింది శ్రీకాకుళం-ఒడిశా సరిహద్దుల్లో. ఏనుగు పిల్ల ముద్దుగా ఉందని సెల్ఫీలు దిగి ఆడుకున్నారు. తల్లి తన పిల్ల కోసం వెతుకుతున్న తల్లి ఏనుగుకు ఆ దృశ్యం కనపడింది. అంతే తరువాత జరగకూడనిది నిమిషాల్లో జరిగిపోయింది. 

ఏపీ ఒడిశా సరిహద్దుల్లో ఏనుగుల్ గుంపులు తరచూ హంగామా సృష్టిస్తుంటాయి.ఒక్కోసారి అక్కడి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తాయి. అలాగే ఈ మధ్య ఓ ఏనుగుల గుంపు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం కేశుపురం, బూర్జపాడు, లక్ష్మీపురం గ్రామ పరిసరాల్లో హడావుడి చేసింది. అక్కడి నుంచి ఆ ఏనుగుల గుంపు ఒడిశా వైపు వెళ్ళింది. స్థానికంగా  ఉన్న బహుదా నదిని దాటి వెళుతుండగా ఆ గుంపులో ఓ చిన్న ఏనుగు దారితప్పి చిక్కుపడిపోయింది. దీంతో అక్కడి దగ్గరలో ఉన్న యువకులు దానిని ఒడ్డుకు తీసుకు వచ్చి ఆటలాడుకోవడం మొదలు పెట్టారు. ఆ ఏనుగు పిల్లతో సెల్ఫీలు దిగారు. ఆదుకున్నారు. 

ఇంతలో తప్పిపోయిన తన పిల్ల ఏనుగును వెదుక్కుంటూ తల్లి ఏనుగు అటువైపు వచ్చింది. దానికి తన పిల్ల ఏనుగుతో ఆటలాడుతున్న వారు కనిపించారు. అంతే! కోపంతో వారివైపు ఉరికింది. దెబ్బకు అందరూ అక్కడి నుంచి పరుగులంకించుకున్నారు. ఈ సంఘటన జరుగుతున్న ప్రాంతానికి కొద్దీ దూరంలో ఒక యువకుడు ఈ విషయాన్ని గమనించకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. అందరూ అక్కడ నుంచి పారిపోగా.. ఈ యువకుడు ఏనుగుకు చిక్కాడు. అంతే.. ఆ పెద్ద ఏనుగు ఆ యువకుడిని ఫుట్ బాల్ ఆడేసింది. కాళ్లతో తొక్కి పారేసింది. ఈలోపు అక్కడి స్థానికులు పరుగుల పై వచ్చి ఏనుగును తరిమేశారు. తీవ్రంగా గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ, అప్పటికే ఆయువకుడు ఏనుగు కోపానికి బలైపోయాడు. 


Tags:    

Similar News