Andhra Pradesh: నేటి నుంచి కొవాగ్జిన్‌ టీకా రెండో డోసు

Andhra Pradesh: ఈరోజు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా కొవాగ్జిన్‌ టీకా రెండో డోసు వేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Update: 2021-05-26 02:32 GMT

Second Dose of Covaxin:(File Image) 

Andhra Pradesh: ఏపీలో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బుధ, గురువారాల్లో కొవాగ్జిన్‌ రెండో డోసు వేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ రెండు రోజుల్లో 90వేల మందికి టీకా వేస్తామన్నామని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ప్రకటించారు. జూన్‌ 15 తర్వాత కేంద్రం నుంచి వచ్చే వ్యాక్సిన్లను బట్టి కొవిషీల్డ్‌ రెండో డోసు ప్రారంభిస్తామని తెలిపారు.

మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ… కృష్ణపట్నం మందుపై ప్రభుత్వం 3-4 రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందన్నారు. కంట్లో వేసే మందుతో ఎవరికైనా నష్టం కలిగిందా అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారని తెలిపారు. శుక్రవారంలోగా దీనిపై స్పష్టత వస్తుందని అభిప్రాయ పడ్డారు. అయితే ఇంతవరకూ రాష్ట్రంలో 252 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు గుర్తించామని, దీని కారణంగా మరణాలు సంభవించినట్లు సమాచారం లేదన్నారు. 

Tags:    

Similar News