Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు పెరుగుతున్న వరద
* జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీరు విడుదల * ఇన్ ఫ్లో 2,20,810 క్యూసెక్కులు * ఔట్ ఫ్లో 1,00,197 క్యూసెక్కులు
Srisailam Project: కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు రెండు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువనుంచి 2 లక్షల, 20వేల, 810 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1.22 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా ప్రస్తుతం 883.90 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.