Raids on Unlicensed Covid Test Labs: అనుమతి లేని కోవిడ్ టెస్ట్ ల్యాబ్‌లపై దాడులు
Raids on Unlicensed Covid Test Labs: విశాఖ జిల్లా,నర్సీపట్నంలో ప్రభుత్వ అనుమతి లేకుండా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న SRL డయాగ్నొస్టిక్ క్లినికల్ లాబ్ ను సీజ్ చేసిన అధికారులు. ఇతర ల్యాబ్ లకు హెచ్చరికలు జారీ.
Raids on Unlicensed Covid Test Labs: నర్సీపట్నంలో ప్రభుత్వ అనుమతి లేకుండా కోవిద్ పరీక్షలు చేస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ, పోలీస్, గ్రామసచివాలయ అధికారులు శనివారం క్లినికల్ ల్యాబ్ లపై దాడులు నిర్వహించారు. నర్సీపట్నంలో కొన్ని క్లినికల్ లాబ్ లలో అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారని ఇటీవల ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు రంగప్రవేశం చేసి లాబ్ లను పరిశీలించారు.
ఈమేరకు నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్ దగ్గర్లో ఉన్న ఎస్.ఆర్.ఎల్ తనిఖీలు నిర్వహించి, కోవిద్ పరీక్షలు చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో సంబందిత డయాగ్నొస్టిక్ సెంటర్ ను అధికారులు సీజ్ చేశారు.
ఈ సందర్భంగా సచివాలయ అడ్మిన్ రమణ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో వసూళ్లు చేస్తున్నారని, ప్రభుత్వ అనుమతి లేకుండా కోవిద్ పరీక్షలు చేస్తున్నారని, స్థానిక ఏరియా ఆసుపత్రి కోవిద్ ఇంచార్జ్ అనిల్ కుమార్ పిర్యాదుమేరకు మునిసిపల్ కమిషనర్ కనకరావు ఆదేశాలపై SRL డయాగ్నొస్టిక్ సెంటర్ ను తనిఖీ చెయ్యగా టెస్టులు జరుగుతున్నట్లు నిర్ధారణ కావడంతో సీజ్ చేశామన్నారు.
దీంతోపాటు నర్సీపట్నం పలు లాబ్ లలోకూడా చేస్తున్నారు అనే ఫిర్యాదుల పై 18 క్లినికల్ లాబ్ లకు నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి పర్మిషన్లు లేకుండా టెస్టులు నిర్వహించారదని అలా నిర్వహించినట్లైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు. వీటికి సంబందించి లాబ్ లకు నోటీసులు జారీ చేశామని వివరించారు