ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ కీలకనేతలు

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పెనుమత్స సురేష్, జకీయా ఖానుమ్ మంగళవారం ప్రమాణ..

Update: 2020-10-06 10:01 GMT

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పెనుమత్స సురేష్, జకీయా ఖానుమ్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్‌ షరీఫ్‌ వీరిద్దరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, అంజాద్‌ భాషా, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, శాసనసభ చీఫ్‌ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, బడ్డుకొండ అప్పల నాయుడు, ఎమ్మెల్సీ వెన్నపూస వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. 'విజయనగరం జిల్లాలో పార్టీని ఆదినుంచి ముందుండి నడిపింది పెనుమత్స సాంబశివరాజు కుటుంబానికి తగిన న్యాయం జరిగిందని అలాగే మైనారిటీ మహిళకూ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం గొప్ప పరిణామం అని అన్నారు. అలాగే అంజాద్‌ భాషా మాట్లాడుతూ.. మైనారిటీ మహిళను ఎమ్మెల్సీ చేయడం మైనారిటీలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న ప్రేమకు నిదర్శనం అని అన్నారు. నముకున్నవారికి న్యాయం చేయడంలో వైఎస్ కుటుంబం ముందుంటుంది అని అన్నారు.

ఇక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీతో తొలి రోజు నుంచి వెన్నంటే ఉన్న సాంబశివరాజు కుమారుడు సురేష్‌కి సీఎం జగన్ అవకాశం ఇచ్చారని.. అలాగే పార్టీకి చెందిన దివంగత నాయకుడు సతీమణికి మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం సీఎం జగన్ కల్పించారని అన్నారు. ఎమ్మెల్సీల ఎంపికలో సీఎం జగన్ ప్రత్యేక శైలి పాటించారని అన్నారు. 

Tags:    

Similar News