Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ రంగంలోకి దిగడంతో యువతి మిస్సింగ్ కేసులో వీడిన మిస్టరీ

Girl Missing Case: భీమవరంకి చెందిన యువతి మిస్సింగ్ కేసును బెజవాడ పోలీసులు చేధించారు.

Update: 2024-07-02 12:30 GMT

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ రంగంలోకి దిగడంతో యువతి మిస్సింగ్ కేసులో వీడిన మిస్టరీ

Girl Missing Case: భీమవరంకి చెందిన యువతి మిస్సింగ్ కేసును బెజవాడ పోలీసులు చేధించారు. దాదాపు 9 నెలల తర్వాత యువతి ఆచూకీ లభ్యమైంది. ఫిర్యాదు చేసినా యువతి మిస్సింగ్‌ను పోలీసులు పట్టించుకోవడం లేదని గత నెల 22న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి శివకుమారి తెలిపింది. జనవాణి కార్యక్రమంలో భాగంగా యువతి మిస్సింగ్‌పై ఆమె తల్లి శివకుమారి ఫిర్యాదు చేశారు.

యువతి మిస్సింగ్‌ కేసు వ్యవహారంలో సీఐతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు పవన్ కల్యాణ్. పవన్ ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు జమ్ముకశ్మీర్‌లో విజయవాడకు చెందిన యువకుడితో ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న స్పెషల్ టీం పోలీసులు... అక్కడి నుంచి విజయవాడకు తీసుకువస్తున్నారు.

Tags:    

Similar News