Pawan Kalyan: వచ్చే ఎన్నికలలో ఇక్కడి నుంచే పోటీకి రెడీ అవుతున్నారా?
Pawan Kalyan: గాజువాకపై జనసేన అధినేత దృష్టి పెట్టారా?
Pawan Kalyan: గాజువాకపై జనసేన అధినేత దృష్టి పెట్టారా? పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలన్న సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారా? అందుకే ఉక్కు ఉద్యమంలో తనదైన శైలిలో దూకుడు పెంచారా? విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలంటూ అధికారపార్టీకి అల్టిమేటం ఎందుకిచ్చారు? అసలు జనసేనాని రెండున్నరేల్ల తర్వాత గాజువాకపై ఎందుకు ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికలలో ఇక్కడి నుంచే పోటీకి రెడీ అవుతున్నారా? సేనాని మదిలో ఏముంది?
కిందటి ఎన్నికల్లో పోటీ చేసిన గాజువాక నియోజకవర్గంపై పట్టు సాధించడానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకే గత కొన్ని నెలలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటకీరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నా ఇన్నాళ్లూ దూరంగా ఉన్న పవన్ ఒక్కసారిగా ఉద్యమంలోకి ఎంట్రీ ఇచ్చారట. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారట. ఇది వ్యక్తిగతంగా పవన్‌కు, రాజకీయంగా జనసేనకు మంచి మైలేజ్ ఇచ్చిందని జనసైనికులు చెప్పుకుంటున్నారు. ఈ సభ తర్వాత పవన్‌కు గాజువాకలో మంచి క్రేజ్ వచ్చిందని అంటున్నారు. గతంలో పవన్ దూరం పెట్టిన నాయకులు క్షమాపణ చెప్పి మరీ వచ్చి కలుస్తున్నారట. అంతేకాదు పవన్‌ని 2019 ఎన్నికల్లో ఎందుకు గెలిపించుకోలేకపోయామని కూడా ఫీలవుతున్నారట.
వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ అటువంటి పరిస్థితి రాకుంటా చూసుకుంటామంటూ జనసైనికులు సేనాని మాట ఇస్తున్నారట. అంతేకాదు స్టీల్‌ప్లాంట్ బహిరంగ సభలో కొందరు ఉద్యమకారులు మిమ్మల్ని గాజువాక ఎమ్మెల్యేగా ఎన్నుకోనందుకు క్షమించమని బహిరంగంగానే చెప్పడాన్ని చూస్తుంటే పవన్ అంటే అక్కడి వారికి ఇంకా గురుత్వం పోలేదని అనుకుంటున్నారట. మొన్నటి సాధారణ ఎన్నికలలో గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధి తిప్పలు నాగిరెడ్డి చేతిలో ఓడిపోయిన నాటి నుంచి గాజువాక వైపు కన్నెత్తి చూడలేదు. గాజువాకలోని జనసేన నాయకులు సేనాని రావాలంటూ ఎన్నిసార్లు కోరినా దానికి ఆయన అంగీకరించలేదు. పార్టీ తరుపున ఏ కార్యక్రమం చేపట్టినా ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభించే పవన్ ఉత్తరాంధ్ర పర్యటనకు ఎప్పుడు వచ్చినా గాజువాక టచ్ చేసుకొని వెళ్లేవారు. అయితే గాజువాకలో ఓడిపోయిన తరువాత ఆ నియోజకవర్గాన్ని మర్చిపోయారట.
అయితే, పవన్ విశాఖ పర్యటనపై వేరే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పోగొట్టుకున్న చోట రాబట్టుకోవాలనే సిద్ధాంతాన్ని పాటిస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. అందుకే విశాఖలో పవన్ సడన్ ఎంట్రీ ఇచ్చారన్న మాటలు వినిపిస్తున్నాయి. రానున్న ఎన్నికలలో మళ్లీ గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారట. ఇప్పటికే నియోజకవర్గం నాయకులతో ప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్నారట. గాజువాకలో సమస్యలపై కూడా దృష్టి సారిస్తున్న పవన్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ప్రధానంగా దృష్టి పెట్టారని చెప్పుకుంటున్నారు. మరి జనసేనాని గాజువాకలో పట్టు సాధించి రానున్న ఎన్నికలలో పోటీ చేశ్తారో లేదో చూడాలి.