విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్లో ఈ నెల 13న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 415 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 60 చోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా చోట్ల అధికార, ప్రతిపక్షాల మద్దతుదారులు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎన్నికల తేది సమీపిస్తుండడంతో క్రమక్రమంగా పల్లె రాజకీయం వేడెక్కుతోంది.
విజయనగరం జిల్లాలో రెండో విడతలో తొలిదఫాగా పార్వతీపురం డివిజన్ లో పంచాయతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13న 415 పోలింగ్ నిర్వహించాల్సి వుండగా 60 సర్పంచ్ స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 355 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.
ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో పల్లెల్లో రాజకీయాలు వేడేక్కాయి. 355 పంచాయతీల్లో ద్విముఖ, త్రిముఖ, మరికొన్నిచోట్ల బహుముఖ పోటీ నెలకుంది. ఢీ అంటే ఢి అన్నట్టుగా అభ్యర్థులు తలపడుతున్నారు.
తొలి విడతలో ఏకగ్రీవం కానున్న 60 సర్పంచి స్థానాల్లో అత్యధికులు వైసీపీ మద్దతుదారులు ఉన్నారు. కొన్ని చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు రెబల్స్ గా బరిలో దిగడం అసలైన అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. ఎన్నికలు జరగనున్న 345 స్థానాల్లో టిడిపి మద్ధతుదారులు, కొన్నిచోట్ల సిపిఎం మద్ధతుదారులు పోటీలో నిలిచారు. ఈ నెల 13న పార్వతీపురం డివిజన్ లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో క్రమక్రమంగా గ్రామాల్లో రాజకీయం వేడుక్కుతోంది.