AP Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతోన్న అధికారులు

AP Elections 2024: EVMల భద్రతపై సిబ్బందిని ఆరా తీసిన అధికారులు

Update: 2023-11-01 06:45 GMT

AP Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతోన్న అధికారులు

AP Elections 2024: మరో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. కర్నూలు జిల్లాలోని ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవల్ చెకింగ్ చేశారు. కేంద్ర ఎన్నికల FLC పరిశీలకులు, EVMల నోడల్ అధికారి లలిత్ మిట్టల్ ఈ యంత్రాలను పరిశీలించి వాటి పరిస్థితి అంచనా వేశారు.

కర్నూలు కలెక్టరేటు పరిధిలోని కమాండ్ కంట్రోల్‌ భవనంలో భద్రపరిచిన EVMలను నోడల్ అధికారి లలిత్ మిట్టల్ స్వయంగా తనిఖీ చేశారు. EVMలతో పాటు వీవీ ప్యాట్లను, బ్యాలెట్ యూనిట్‌ను పరిశీలించారు. వీవీ ప్యాట్లు, బెల్ ఇంజినీర్లు, రెవిన్యూ సిబ్బంది పనితీరును FLC పరిశీలకులు పరిశీలించారు. EVMల భద్రతపై సిబ్బందిని ఆరాలు తీశారు. సెక్యూరిటీ విధులు, వారి హాజరు, పోలీస్ సిబ్బంది పనితీరు పని గంటలు, అటెండెన్స్‌‌లు చెక్ చేశారు. ఫస్ట్ లెవల్ చెకింగ్ లో ఎలాంటి సమస్యలు లేవని తెలుసుకున్న లలిత్ మిట్టల్ సంతృప్తి వ్యక్తం చేశారు.

EVMలు పరిశీలించిన అనంతరం లలిత్ మిట్టల్ కలెక్టరేట్ లోని ఎన్నికలకు సంబందించిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను కూడా పరిశీలించారు. ఎంత మంది సిబ్బంది విధి నిర్వహణలో వున్నారో గమనించారు. వెబ్ కాస్ట్ నిరంతరం జరుగుతుందా ఏదైనా ఇబ్బంది ఉందా అనే విషయంపై వివరాలు సేకరించారు. 

Tags:    

Similar News