కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు.. టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు..

Update: 2020-12-22 04:00 GMT

కరోనా వైరస్ మహమ్మారి ఆటకట్టించేందుకు ఏపీ సర్కార్ సమాయత్తం అయ్యింది. వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధం చేస్తుంది. పట్టణ ప్రాంతాల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీకి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ర్ట మున్సిపల్ శాఖ కమిషనర్ చైర్మన్ గా తొమ్మిది మంది సభ్యులతో కమిటీ నియమించింది. ఈనెల 25 నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అంచనా వేసినా మరికొంత సమయం పడుతుందని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. వ్యాక్సిన్ వచ్చేలోపు పూర్తి సంసిద్ధతతో ఉండే విధంగా కేంద్రం జారీ చేసిన సూచనల ప్రకారం కార్యాచరణ అమలు చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా కోరనా వ్యాక్సిన్ ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే వెంటనే పంపిణీకి ఏర్పాటుకు వీలుగా అర్బన్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ శాఖ కమిషనర్‌ ఛైర్మన్‌గా 9 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్ధాయి కమిటీలను ఏర్పాటు చేసింది.

రాష్ట స్థాయి టాస్క్ పోర్స్ లో 16 మంది జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ లో 34 మంది సభ్యులను నియమించింది ప్రభుత్వం. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ఈ టాస్క్ పోర్స్ లు పని చేయడం ప్రారంభించనున్నాయి. వ్యాక్సిన్‌ సజావుగా పంపిణీ చేయడం, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం, ఎలాంటి సమస్యలు రాకుండా వంటి బాధ్యతలను ఈ టాస్క్‌ఫోర్స్‌లు నిర్వర్తిస్తాయి. 

Full View


Tags:    

Similar News