వైజాగ్ సాగర తీరంలో మరో సరికొత్త ప్రాజెక్టు.. నీటిపై తేలియాడే...
Vizag Beach: రూ.10 కోట్లతో బంగ్లాదేశ్ నౌకను డెవలప్ చేసే ప్లాన్...
Vizag Beach: సిటీ ఆఫ్ డెస్టినీ సాగరతీరంలో మరో సరికొత్త ప్రాజెక్టు రాబోతోంది. పర్యటకులను మరింత ఆకర్షించేలా టూరిజంశాఖ వారు సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. సాగర తీరంలో మరింత ఉల్లాసాన్నిచ్చేలా నీటిపై తేలియాడే రెస్టారెంట్ ను తీర్చిదిద్దుతోంది. ఇందుకోసం ఏకంగా 1.25 కోట్లతో ప్రత్యేక నౌకనే కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే పర్యాటన రంగంలో ఏపీలోనే ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గా ఉన్న వైజాగ్ కు ఈ ఎంవీ మా ప్రాజెక్టు మరింత ఖ్యాతి తెచ్చిపెట్టనుంది.
సముద్రపు అలలు, చల్లగాలులు, ఆహ్లాదభరిత వాతావరణంతో మంత్రముగ్దుల్ని చేసే విశాఖ సాగర తీరం.... ఎంత చూసినా తనివి తీరని ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. అలాంటి వైజాగ్ సిటీకి టూరిజంశాఖ మరికొన్ని అందాలు అద్దుతోంది. MV మా పేరుతో సరికొత్త టూరిజం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం సాగర తీరంలోని అందాల కొలను తెన్నేటి పార్కును అప్పగిస్తోంది. గతరెండేళ్ల బంగ్లాదేశ్‌కు చెందిన ఎంవీ మా అనే నౌక తుఫాన్ కు విశాఖపట్నం పోర్టు అవుటర్ హార్బర్ నుంచి తెన్నేటి పార్కు సమీపాన రాళ్ల మధ్య చిక్కుకుపోయింది.
షిప్ ను తిరిగి సముద్రంలోకి తీసుకువెళ్లేందుకు యాజమాన్యం విశ్వ ప్రయత్నం చేసింది.. అక్కడి నుంచి కదల్చలేమని నిర్ణారించకుని ప్రయత్నాలు మానేశారు. ఆ తర్వాత నౌక యజమాని శిథిల నౌకలను కొనుగోలు చేసే గిల్‌మెరైన్ సంస్థకు అమ్మేశారు. దీంతో ఇప్పుడీ నౌకను కొనుగోలుచేసేందుకు ఏపీ ప్రభుత్వం టూరిజం శాఖ ఆద్వర్యంలో గిల్‌మెరైన్ సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. మొత్తం 1.25 కోట్లకు నౌకను కొని, మరో 10.5 కోట్లతో ఆ ప్రాంతమంతా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ డెవలప్మెంట్ బాధ్యతలను గిల్ మెరైన్ సంస్థకు అప్పగించింది.
తెల్లేటి సరస్సు కు చేరుకోవాలంటే.. సాగర తీరంలోని జోడుగుళ్లపాలెం బీచ్ రోడ్డు, తెన్నేటి పార్కు రూటు, జీవీఎంసీ శ్మశానం పక్క నుంచి ఇలా మొత్తం 3 మార్గాలు ఉన్నాయి. అయితే ఇందులో మొదటి రూట్ డెవలప్మెంట్ చేయాలంటే.. అటవీశాఖ పరిధిలోని భూమి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుంది. అలాగే తెన్నేటి పార్కు నుంచి అయితే వీఎంఆర్‌డీఏ, శ్మశానం దగ్గరైతే జీవీఎంసీ అనుమతులు ఇవ్వాలి.
ఇక మిగిలి మూడో దారి శ్మశానం పక్క నుంచి అయితే సెంటిమెంట్ బాగోదని తెన్నేటి పార్కును ఎంచుకుంది గిల్ మెరైన్ సంస్థ. ఇందులో భాగంగానే.. తెన్నేటి పార్కును తమకు అప్పగిస్తే, రాకపోకలకు మార్గం ఏర్పాటు చేసుకుంటామని అటవీశాఖ తోపాటు జీవీఎంసీ, ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే టూరిజంశాఖ కు ప్రభుత్వ నుంచి క్లియరెన్స్ వస్తే.. ఈ పనులు శరవేగంగా ప్రారంభం కానున్నాయి.
ఇక తెన్నేటి పార్కులోకి రూపాయి కూడా ఫీజు లేకుండా నగర ప్రజలను ఎన్నో ఏళ్ల నుంచి టూరిజం శాఖ అనుతిస్తోంది. అయితే ఇప్పుడు ఫ్లోటింగ్ రెస్టారెంట్ పేరుతోఈ ప్రాంతాన్ని ప్రైయివేటుసంస్థకు అప్పగిస్తే... ప్రజలు, స్థానికులకు రిస్ట్రక్షన్ తోపాటు డబ్బులు కూడా వసులు చేసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంతో ఆదరణ కలిగిన ఆ పార్కును గిల్‌మెరైన్ సంస్థకు అప్పగించొద్దని స్థానికులు కోరుతున్నారు. డెవల్మెంట్ కోసం టూరిజం శాఖ మరో అల్టర్నేట్ రూట్ చూసుకుంటే మంచిందన్న అభప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు విశాఖ వాసులు .