Narsipatnam MLA Ganesh: రాబోయే రోజుల్లో పర్యాటకంగా మరింత అభివృద్ధి
Narsipatnam MLA Ganesh: రాబోయే రోజుల్లో కేడీపేట అల్లూరి పార్కును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ హామీ ఇచ్చారు.
Narsipatnam MLA Ganesh: రాబోయే రోజుల్లో కేడీపేట అల్లూరి పార్కును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ హామీ ఇచ్చారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని గొలుగొండ మండలం కేడీపేట అల్లూరి పార్కులో ఉన్న సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యంలోని గిరిజనులపై తెల్లదొరలు చేస్తున్న దోపిడీని అరికట్టాలనే లక్ష్యంతో పిన్న వయస్సులోనే అల్లూరి సీతారామరాజాు పోరాట యోధుడయ్యాడన్నారు.
ఆ సమయంలో గిరిజనులకు రక్షించేందుకు తెల్లదొరలపై అనేక విధాలుగా పోరాటాలు చేసిన మహనీయుడన్నారు. అయితే అప్పట్లో ఆయన పోరాటంతో ఇబ్బందులు పడ్డ తెల్లదొరలు అల్లూరిని హతమార్చేందుకు ప్రజలు ప్రాణాలను తీసేందుకు సైతం వెనుకాడలేదన్నారు. ఈ పరిస్థితుల్లో తానే స్వయంగా ఆంగ్లేయులకు సమాచారమిచ్చి లొంగిపోయాడన్నారు. అలాంటి వ్యక్తిని స్మరించుకోవడం ఎంతైనా సమంజసమన్నారు. దీనిలో భాగంగానే గత ఏడాది పార్కు అభివృద్ధి కి మంత్రి అవంతి రూ. 55 లక్షల నిధులు మంజూరు చేశారన్నారు. అయితే కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల ఆ పనులు ప్రారంభం కాలేదన్నారు. భవిషత్తులో సైతం ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.