Nara Lokesh: ఎంక్వైరీ టైమ్.. IRR స్కామ్ కేసులో విచారణకు హాజరైన లోకేష్
Nara Lokesh: చంద్రబాబు నుంచి రింగ్ రోడ్డు అలైన్మెంట్ సమాచారం ముందే తెలిసిందా?
Nara Lokesh: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో.. సీఐడీ అధికారులు.. లోకేష్‌ను విచారిస్తున్నారు. పెదకాకాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్‌ల ఆధారంగా లోకేష్‌ను సీఐడీ ప్రశ్నిస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు సమాచారం మీకు ముందే ఎలా తెలుసా..? మూడుసార్లు అలైన్మెంట్ మార్చడం వెనుక మీ పాత్ర ఉంది కదా అంటూ ప్రశ్నించారు. హెరిటేజ్ సంస్థకు లబ్ది చేకూర్చేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారు.. హెరిటేజ్ సంస్థ ఆ ప్రాంతంలోనే ఎందుకు భూములు కొనుగోలు చేసింది.. 2014జూలై 30న జరిగిన హెరిటేజ్ బోర్డు సమావేశంలో భూముల కొనుగోలుపై తీర్మానం చేశారు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు సీఐడీ అధికారులు. లింగమనేని రమేష్‌కి మీకు ఉన్న సంబంధం ఏంటన్న సీఐడీ.. మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు పరిసరాల్లోనే భూములు ఎందుకు కొనుగోలు చేశారన్నారు.