రోజాను ప్రశంసిస్తూ.. ప్రభుత్వాన్ని ఎండగడుతూ.. నగరి కమిషనర్ సంచలన వ్యాఖ్యలు
చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరి ఎమ్మెల్యే రోజాను ప్రశంసిస్తూ.. ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఉన్నాధికారుల తీరును ఎండగడుతూ.. వీడియో తీశారు. ప్రభుత్వం తమ ఖాతాలను బ్లాక్ చేశారని, మాస్కులు, కిట్లు, లేవన్నారు. ఎమ్మెల్యే రోజా మాత్రమే అన్ని విధాలా అన్ని శాఖలవారికీ సహకరిస్తున్నారని కమిషనర్ అన్నారు.
నగరిలో నాలుగు కరోనా పాటిజిట్ కేసులు నమోదయ్యాయని, ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే సాయం కూడా చేయకపోయకపోతే ప్రజల పరిస్థితి ఎలా ఉండేది.. అందరికీ భోజనాలు పెట్టిస్తూ 5 మండలాల బాధ్యతను తీసుకుంటానన్నారని కమిషనర్ చెప్పుకొచ్చారు.
మాజీ కౌన్సిలర్లు, రాజకీయ నాయకులు తమకు నచ్చిన విధంగా సహాయం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం నుంచీ ఎలాంటి మాస్కులు రాలేదన్నారు. పీపీఈ డ్రస్సులు, గ్లవుజులు, బూట్లు లేవన్నారు.
ఎమ్మెల్యే రోజాకు మున్సిపల్ శాఖ , పోలీసు, వైద్య సిబ్బంది తరపున ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినా.. వీధుల్లోకి తాము, మున్సిపల్ , పోలీసులు, వైద్య సిబ్బంది కలిసి వెళ్తున్నామని అన్నారు. ప్రజలకు ఈ విషయాలన్నీ తెలియజేయాలనే ఈ వీడియో పంపుతున్నాని వెంకట్రామిరెడ్డి అన్నారు