Mudragada Padmanabham: పవన్‌కు ముద్రగడ లేఖ.. వీధి రౌడీ భాషలో మాట్లాడటం ఎంతవరకు న్యాయం
Mudragada Padmanabham: కలిసి పోటీ చేసినప్పుడు సీఎం చేయండనడం హాస్యాస్పదం
Mudragada Padmanabham: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ రాశారు. వీధి రౌడీ భాషలో మాట్లాడటం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. పవన్ మాట్లాడే భాష వల్ల నష్టం తప్ప లాభం లేదన్నారు. ఇప్పటివరకు ఎంతమందిని చెప్పుతో కొట్టారో.. గుండ్లు గీయించారో చెప్పాలని పవన్‌ను ముద్రగడ ప్రశ్నించారు. ఇక. ద్వారంపూడి కుటుంబం తప్పుడు మార్గాల్లో సంపాదిస్తోందని మాట్లాడటం తప్పు అని, కాపుల ఉద్యమానికి సహాయం చేసినవారిని విమర్శించడం కరెక్ట్ కాదన్నారు. కాపు ఉద్యమానికి పవన్ ఎందుకు రాలేదని నిలదీశారు.
వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిపై పోటీ చేసి చిత్తుగా ఓడించండి. సత్తా చూపడానికి ముందుకు రండి అంటూ పిలుపునిచ్చారు. 175 స్థానాల్లో పోటీ చేసినప్పుడు సీఎంని చేయండని అనాలి తప్ప. కలిసి పోటీ చేసినప్పుడు సీఎం చేయండనడం హాస్యాస్పదమన్నారు. తాను కులాన్ని వాడుకొని రాజకీయంగా ఎదగలేదని, యువతను వాడుకొని పబ్బం గడుపుకోలేదని లేఖలో స్పష్టం చేశారు. కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఉద్యమం చేయలేదని, తాను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి. యువతకు రిజర్వేషన్ ఫలాలు పవన్ ఎందుకు అందించలేదన్నారు. కాపు ఉద్యమంతో తాను ఓటమికి దగ్గరయ్యానన్నారు ముద్రగడ.