Vasantha vs Jogi Ramesh: మైలవరం పంచాయతీపై వైసీపీ అధిష్టానం దృష్టి..
Vasantha vs Jogi Ramesh: మైలవరం పంచాయతీపై వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది.
Vasantha vs Jogi Ramesh: మైలవరం పంచాయతీపై వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్ మధ్య ఆధిపత్య పోరు తలెత్తగా.. సజ్జల రామక్రిష్ణారెడ్డి సమస్య పరిష్కారంపై కాన్సంట్రేట్ చేశారు. వివాదంపై నిన్న వసంత కృష్ణప్రసాద్ వివరణ ఇచ్చారు. ఇవాళ మంత్రి జోగి రమేష్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు రామక్రిష్ణారెడ్డి భేటీ అయ్యారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తనపై చేసిన ఫిర్యాదులపై వివరణ ఇచ్చారు. మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంతకు మంత్రి జోగిరమేష్ మధ్య గతకొన్ని రోజులుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈనేపథ్యంలో నిన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ సజ్జలను కలి మంత్రి జోగిపై ఫిర్యాదు చేశారు. ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకున్న సజ్జల సోమవారం నాడు ఎమ్మెల్యే వసంతకృష్ణ, జోగిరమేష్తో సమన్వయ భేటీ నిర్వహించనున్నట్లు తెలిపారు.