ఎన్నికలకు ఎప్పుడూ వైసీపీ భయపడదు -మంత్రి బాలినేని

*కోర్టు తీర్పును గౌరవిస్తాం -మంత్రి బాలినేని *రాష్ట్రంలో 90 శాతం పంచాయతీల్లో గెలుపు మాదే -బాలినేని

Update: 2021-01-28 15:00 GMT

ఎన్నికలకు ఎప్పుడూ వైసీపీ భయపడదు -మంత్రి బాలినేని

ఎన్నికలకు ఎప్పుడూ వైసీపీ వెనకాడదని అన్నారు మంత్రి బాలినేని శ్రీనివాస్‌. కరోనాను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను కొంతకాలం వాయిదా వేయాలని కోరామని కానీ కోర్టు తీర్పును గౌరవిస్తూ ఎన్నికలకు సిద్ధమయ్యామని తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం పంచాయతీల్లో వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి బాలినేని. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జిల్లా పార్టీ కార్యలయంలో జరిగిన నేతల భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ఏవైనా తమ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న సంక్షేమ పథకాలే తమ పార్టీని గెలిపిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Tags:    

Similar News