Andhra Pradesh: ముఖ్యమంత్రి జగన్‌తో ఉద్యోగ సంఘాల నాయకుల భేటీ

Andhra Pradesh: తమ డిమాండ్లను నెరవేర్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు

Update: 2022-02-07 02:45 GMT

ముఖ్యమంత్రి జగన్‌తో ఉద్యోగ సంఘాల నాయకుల భేటీ

Andhra Pradesh: కరోనా పరిస్ధితుల వల్లే ఉద్యోగులు అడిగినంతమేర ఫిట్ మెంట్ ఇవ్వలేకపోయినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయని, ఈ పరిస్ధితుల్లోనూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. ఇందుకు ప్రభుత్వంపై ఏటా 11 వేలకోట్ల అదనపు భారంపడిందన్నారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పడు పరిష్కరిచేందుకు మంత్రుల కమిటీని కొనసాగిస్తున్నట్లు జగన్ వెల్లడించారు. అలాగే సీపీఎస్ రద్దు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.

2018-19లో రూ.62 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయం 15 శాతం పెరిగి 2019-20 నాటికి రూ.72 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. కానీ రూ.60 వేల కోట్లకు పడిపోయిందని సీఎం వెల్లడించారు. ఉద్యోగులు అడక్కపోయినా రిటైర్‌మెంట్‌ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని సీఎం తెలిపారు. ఉద్యోగుల మరో ప్రధాన డిమాండ్ అయిన సీపీఎస్‌ హామీ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం తెలిపారు.

30వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నామన్న సీఎం ఈ జూన్ నాటికి ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తున్నామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు వర్తింపచేశామన్నారు జగన్. అంగన్వాడీలు, ఆశావర్కర్లు, హోంగార్డులు, శానిటేషన్ వర్కర్స్ అందరి వేతనాలు పెంచినట్లు తెలిపారు.

సాధన సమతి నేతలు సీఎం జగన్ ను కలిశారు. పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ తదితరులు సీఎంను తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో కలిశారు. సమ్మె నోటీసులోని డిమాండ్లను పరిష్కరించడంపై సీఎంకు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. పీఆర్సీ సాధన సమితి నేతల వెంట ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ ,ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. 

Tags:    

Similar News