Gannavaram Airport: ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పిన విమానం
Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్టులో ముప్పు తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పింది.
Gannavaram Airportవిమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. దోహా నుంచి గన్నవరం చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. రన్ వే నుంచి పార్కింగ్‌కు వెళుతుండగా.. రన్ వే పక్కనే ఉన్న ఫ్లడ్‌లైట్ పోల్‌ను విమానం ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు ఉండగా.. వారంతా సురక్షితంగా బయటపడ్డారు.
మరోవైపు.. పైలట్ వెంటనే అప్రమత్తం కావడంతోనే పెను ప్రమాదం నుంచి బయటపడ్డామన్నారు ప్రయాణికులు. సురక్షితంగా గమ్య స్థానానికి చేరడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడకు చెందిన వరలక్ష్మి ప్రమాదం జరిగిందన్న సంఘటనతో ఒక్కసారిగా భయందోళనకు గురయ్యానని.. దేవుడి దయవల్ల ప్రమాదం చిన్నదే అని సిబ్బంది దైర్యం చెప్పడంతో ఉపిరి పీల్చుకున్నట్లు తెలిపారు.
ఇక.. ఈ ప్రమాదంలో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ బోయింగ్ ఫ్లైట్ వింగ్ పాక్షికంగా దెబ్బతింది. వేగంగా విమానం ఢీకొట్టడంతో ఫ్లడ్‌లైట్ పోల్ పూర్తిగా నేలకొరిగింది. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడడంతో ప్రయాణికులు స్వస్థలాలకు పయనమయ్యారు. ప్రమాద సమయంలో పైలట్ ఏమాత్రం అజాగ్రత్తగా పెను విధ్వంసం జరిగి ఉండేది.