Tirupati: తిరుపతి స్విమ్స్‌లో తప్పిన ప్రమాదం
Tirupati: తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున అకస్మాత్తుగా ఆక్సిజన్ నిల్వలు తగ్గాయి.
Tirupati: తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున అకస్మాత్తుగా ఆక్సిజన్ నిల్వలు తగ్గాయి. దీంతో వెంటనే తెల్లవారుజమున 4 గంటలకు స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మకు గ్యాస్ ఆపరేటర్లు సమాచారం అందించారు. వెనువెంటనే కలెక్టర్‌కు వెంగమ్మ ఫోన్ చేసి విషయం తెలియజేశారు. అయితే చెన్నై నుంచి ట్యాంకర్ మధ్యాహ్నం వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ మొదలు పెట్టారు. దీంతో.. అప్రమత్తమైన స్విమ్స్ అధికారులు.. ఏర్పేడు శ్రీకృష్ణ గ్యాస్ ఏజెన్సీ నుంచి ఆక్సిజన్‌ను సేకరించారు. గ్రీన్ ఛానల్ ద్వారా స్విమ్స్‌కు 25 నిమిషాల్లో ఆక్సిజన్ ట్యాంకర్‌ను రప్పించారు. ఆక్సిజన్‌ను స్టోరేజ్ ట్యాంక్‌లో నింపడంతో పేషెంట్లు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.