PUBG Game: ప్రాణాలు బలిగొన్న పబ్ జీ
PUBG Game: పబ్ జీ గేమ్ తో యువకలు జీవితాలు నాశనమవుతున్నాయి. పనీ పాటూ లేకుండా రోజుల తరబడి దీనికి బానిసలు అవుతున్నారు.
PUBG Game: పబ్ జీ గేమ్ తో యువకలు జీవితాలు నాశనమవుతున్నాయి. పనీ పాటూ లేకుండా రోజుల తరబడి దీనికి బానిసలు అవుతున్నారు.దీంతో పాటు కొన్ని గేముల్లో డబ్బులను సైతం తగలేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో లాక్ డౌన్ నేపథ్యంలో పాఠశాలలు, మరో పని లేకపోవడం వల్ల కొంతమంది ఇదే పనిగా ఉండటంతో మరింత వ్యసనంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఒక యువకుడు బలయ్యాడు. రోజుల తరబడి ఆడుతూ ఉండటం, ఆహారాన్ని సైతం పట్టించుకోకుండా వ్యవహరించడం వల్ల ప్రాణాలు వదులుకుంటున్నారు.
పబ్‌జీ యువత జీవితాలతో ఆడుకుంటోంది. ఇప్పటికే ఎంతోమంది ఈ మొబైల్ గేమ్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది తల్లి దండ్రులు ఎన్నో ఏళ్లుగా దాచుకున్న లక్షల డబ్బును క్షణాల్లో తగలేస్తున్నారు. దీంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని జాజులకుంట గ్రామంలో ఇలాంటి సంఘటనే మరొకటి నెలకొంది. గ్రామానికి చెందిన 16ఏళ్ల కుర్రాడు పబ్‌జీ వ్యసనానికి బానిసయ్యాడు. దీంతో రోజుల తరబడి ఆ గేమ్ ఆడుతూనే గడిపేవాడు. ఆహారం తీసుకోవడం మానేశాడు. కనీసం మంచినీళ్లు కూడా తాగడం మరచిపోయాడు. దీంతో కొన్ని రోజులకు అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులు పరీక్షించి ప్రమాదకరమైన డీహైడ్రేషన్‌కు గురయ్యాడని, డయేరియా బారిన కూడా పడ్డాడని వెల్లడించారు. దీంతో చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చేతికందిన కొడుకు చనిపోయాడంటూ కన్నీరు మున్నీరవుతున్నారు.