Anandayya Mandu: ఆనందయ్య మందు మంచిదే: ఆయుష్
Anandayya Mandu: ఆనందయ్య మందుపై ఆయుష్ పరిశోన చేస్తున్న సంగతి తెలిసిందే.
Anandayya Mandu: ఆనందయ్య మందుపై ఆయుష్ పరిశోన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయుష్ కమిషనర్ రాములు ఆనందయ్య మందుపై గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మందులో హానికరమైన పదార్థాలేవీ లేవని తేల్చి చెప్పారు. ఈమేరకు నివేదికను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేసినట్లు ఆయన పేర్కొన్నాడు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. ''ఆనందయ్య మందుతో ఎలాంటి ప్రమాదం లేదు. పూర్తి నివేదిక తర్వాత ప్రజలకు పంపిణీ చేయవచ్చు. నాలుగు రోజుల్లో పూర్తి నివేదక వస్తుంది. సీసీఆర్‌ఏఎస్ నివేదక తర్వాతే మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది'' అని పేర్కొన్నారు.
అలాగే.. ''70 నుండి 80 వేల మందికి పైగా ఇప్పటికే మందు ఇచ్చామని నిర్వాహకులు చెప్పారని అన్నారు. అయితే ఒకరిద్దరిలో స్వల్పంగా ఇబ్బందులు ఉండొచ్చు. మందులో వాడే పదార్ధాలన్నీ ఆయుర్వేదం సమ్మతించినవే'' అని రాములు వివరించారు.
ఈ మందుపై కంటి వైద్య నిపుణుల సలహాలు కూడా తీసుకుంటామని ఆయన అన్నారు. కంట్లో వేసే చుక్కలపై కొన్ని అనుమానాలు ఉన్నాయని, అవి తొలగిపోతే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.